ఆమె మరణం కుంగదీసింది. మిస్ అవుతున్నాను: జయసుధ

కళాబంధు, డా.టి.సుబ్బరామిరెడ్డి పుట్టినరోజు (సెప్టెంబర్ 17)ను పురస్కరించుకొని ప్రతియేటా ప్రముఖ నటీనటులకు బిరుదు ప్రధానం చేసి సత్కరిస్తారు. గత 20ఏళ్లుగా ఆనవాయితీగా సాగిస్తున్న ఈ కార్యక్రమం ఈ సంవత్సరం కూడా నిర్వహించారు. ఈక్రమంలోనే ప్రముఖ నటి జయసుధకు టి. సుబ్బరామిరెడ్డి పుట్టినరోజు సంధర్భంగా సెప్టెంబర్ 17వ తేదీన విశాఖపట్నంలో అంగరంగ వైభవంగా కార్యక్రమం నిర్వహించి అభినయ మయూరి బిరుదు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజీకీయ ప్రముఖులు విచ్చేశారు. సీనియర్ నటి జమున, అలనాటి హీరోయిన్ రాధిక, ఎమ్మెల్యే రోజా, జీవిత, శారద, గాయని పి. సుశీల అలాగే మురళీ మోహన్, రాజశేఖర్, శరత్ కుమార్,బ్రహ్మానందం లతో పాటు ఈ కార్యక్రమంలో టీడీ బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, టీజీ వెంకటేష్, రామకృష్ణరాజు, ఎంవీవీ సత్యనారాయణ, ద్రోణంరాజు శ్రీనివాస్, ఎమ్మెల్యేలు గొల్లబాబూరావు, నాగిరెడ్డి, గంటా శ్రీనివాస రావు లతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.

చివరిగా సన్మాన గ్రహీత సహజ నటి, అభినయ మయూరి జయసుధ మాట్లాడుతూ..' ప్రతీ సంవత్సరం సుబ్బిరామిరెడ్డి గారు పుట్టినరోజుకు వస్తుంటాం.. కానీ, ఈ సంవత్సరం నన్ను ఇలా సత్కరించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. వారి మీద ఎంతో గౌరవంతో ఇక్కడికి అనేకమంది వచ్చారని అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. సినిమాల్లో గుర్తింపు వచ్చిన తరువాత తన మొదటి ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ వైజాగ్‌లోనే ఏర్పాటయిందని నటి జయసుధ పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న అభిమానుల్లో ఎక్కువ మంది విశాఖలోనే ఉన్నారన్నారు. అలాంటి విశాఖలో గొప్ప బిరుదు అందుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇంత మంది ప్రముఖుల మధ్య తనకు అభినయ మయూరి బిరుదు ప్రదానం చేయడం చాలా మాటల్లో చెప్పలేని ఆనందంగా ఉందన్నారు.

Jaya Sudha speech at TSR Birthday Celebrations

టీఎస్సార్‌ నిరంతరం కళాకారులను ప్రోత్సహించడమే అలవాటుగా మార్చుకున్నారన్నారు. అంతేకాకుండా విశాఖను ఆయన ప్రేమించినంతగా ఎవరు ప్రేమించి ఉండరని చెప్పారు.తన గురించి మంచి మాటలు చెప్పిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రాధిక, జయప్రద, శరత్ కుమార్, మురళీ మోహన్, ఇలా వచ్చిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. విజయనిర్మల గారిని మాత్రం ఎంతో మిస్ అవుతున్నానని అన్నారు. పండింటి కాపురం.. జమున గారితో నటించానని, ఆమె ముందు అవార్డు అందుకోవడం నా అదృష్టం అని అన్నారు. అందరి ఆశీస్సులు ఉండాలని సహజనటిగా బిరుదు ఇచ్చిన మీడియాకు కూడా కృతజ్ఞతలు అని జయసుధ తెలిపారు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X