తెలుగుమరిచిపోతున్న జయప్రద
హోంపేజి సినిమా అవీ ఇవీ
చంద్రబాబునాయుడు నిర్లక్ష్య ధోరణితోవిసిగిపోయి సమాజ్‌వాది పార్టీలో చేరిఉత్తరప్రదేశ్ నుంచి లోక్‌సభకుఎన్నికైన జయప్రద తెలుగు నేలనుపూర్తిగా మరచిపోయినట్టు కన్పిస్తోంది.సమాజ్‌వాది పార్టీ తరఫున ఇటీవలబీహార్‌లో విస్తృతంగా ప్రచారం చేసినఆమె ఇప్పుడు బాలీవుడ్‌లో బిజీగా ఉన్నారు.అభినేత్రి హిందీ సినిమాలో అమితాబ్‌బచ్చన్, సంజయ్‌దత్‌లతో ఆమెనటిస్తోంది. దేహ్ క్యాంపస్‌చిత్రాలకు కూడా ఆమె అంగీకరించింది. ఆమ్రపాలిఅనే నృత్యనాటకానికి ఆమెదర్శకత్వం వహిస్తోంది. ఆమెఢిల్లీ-ముంబాయిల మధ్య బిజీగా ఉంది.హైదరాబాద్ వస్తున్న సందర్భాలుచాలా తక్కువ. సమాజ్‌వాది పార్టీఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్ష పదవిని కూడాఆమెకు అప్పగించే ఆలోచనలో ములాయంసింగ్ యాదవ్ ఉన్నారని, అయితే ఢిల్లీ,ముంబాయిల్లో బిజీగా ఉంటున్న ఆమె ఈ కొత్తబాధ్యతను అంగీకరించబోరని ఆమెసన్నిహితులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











