వర్మపై జయకుమార్ కక్ష?: 'జోకర్'తో బదులు తీర్చుకుంటాడట!..

రాంగోపాల్ వర్మ.. ఏదైనా సినిమా నుంచి సీన్స్ ఎత్తుకొచ్చేస్తే నిజాయితీగా వాళ్లకు క్రెడిట్ ఇచ్చేస్తాడు. పలానా సినిమా నుంచి కాపీ కొట్టానని చెప్పడానికి కూడా వెనుకాడడు. అలాంటిది.. స్క్రిప్టు చదవమని చెప్పిన పాపానికి తన కథను కాపీ కొట్టేశాడని జయకుమార్ అనే రచయిత తెర మీదకు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వర్మపై కోర్టును కూడా ఆశ్రయించిన జయకుమార్ ఇప్పుడాయనకు సినిమా ద్వారానే కౌంటర్ ఇవ్వబోతున్నారు..

Recommended Video

వర్మ 'జీఎస్‌టీ' చూడాలంటే ఒక కండిషన్!

 వర్మకు జయకుమార్ కౌంటర్‌:

వర్మకు జయకుమార్ కౌంటర్‌:

తన జీఎస్‌టీ కాన్సెప్టును కాపీ కొట్టి సినిమా తీస్తున్న వర్మకు కౌంటర్‌గా 'డైరెక్టర్' అనే సినిమా తీయబోతున్నాడు జయకుమార్. 'కాపీ కొడుతాడు.. కానీ ప్లాప్స్ తీస్తాడు' అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్.ఓ టీవి చానెల్ డిబేట్ లో ఈ విషయాన్ని ఆయన ప్రకటించాడు.

 'జోకర్' దర్శకత్వంలో.. :

'జోకర్' దర్శకత్వంలో.. :

అయితే తాను తెరకెక్కించబోయే 'డైరెక్టర్' సినిమా వర్మను దెబ్బ కొట్టడానికో.. లేక కౌంటర్ గానో చేయడం లేదని జయకుమార్ పేర్కొనడం గమనార్హం. కాగా, ఈ 'డైరెక్టర్' సినిమకు దర్శకుడు 'జోకర్' అని పోస్టర్ పై పేర్కొన్నారు.

 వర్మపై కక్షతోనేనా?:

వర్మపై కక్షతోనేనా?:

జనవరి 26న వర్మ 'గాడ్,సెక్స్&ట్రూత్‌'ను రిలీజ్ చేయడానికి సిద్దమవగా.. దానికి పోటీగా తన సినిమా పోస్టర్‌ను విడుదల చేయబోతున్నాడు జయకుమార్. వర్మపై కక్ష కాదని చెబుతున్నప్పటికీ.. వర్మ తన కథను కాపీ కొట్టాడన్న ఆగ్రహంతోనే ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు అర్థమవుతోంది.

 జయకుమార్ 'డైరెక్టర్' కథ:

జయకుమార్ 'డైరెక్టర్' కథ:

తాను తెరకెక్కించే సినిమాలో.. హీరో క్యారెక్టర్ ఒక డైరెక్టర్ అని జయకుమార్ చెబుతున్నాడు. ఫ్లాప్ సినిమాలు తీయడంలో ఆ డైరెక్టర్ ఎలా సక్సెస్ అయ్యాడనేది ఈ సినిమా కథ అంటున్నాడు.

వర్మ 'జోకర్' అన్నందుకేనా..:

వర్మ 'జోకర్' అన్నందుకేనా..:

మరోవైపు వర్మ మాత్రం జయకుమార్ కాపీ ఆరోపణలను తిప్పికొట్టాడు. జయకుమార్‌ను ఓ జోకర్‌గా అభివర్ణించారు. వర్మ వ్యాఖ్యలపై జయకుమార్ కూడా ఘాటుగానే స్పందించాడు. 'మంచిదే నేను జోకర్‌నే.. అయితే వర్మ నా బ్యాట్‌మన్' అంటూ వ్యాఖ్యానించాడు. వర్మ తననలా అవమానించినందుకే జయకుమార్ ఇప్పుడీ సినిమా మొదలుపెట్టాడేమో అంటున్నారు.

 రిలీజ్ అయితే ఇంకెంత దుమారమో!:

రిలీజ్ అయితే ఇంకెంత దుమారమో!:

వివాదాల సంగతెలా ఉన్నా.. వర్మ మాత్రం రేపు ఉదయం 'గాడ్,సెక్స్&ట్రూత్‌' రిలీజ్ కు సిద్దమైపోయాడు. ఇప్పటికే వివాదాల్లో నానుతున్న ఈ సినిమా విడుదల తర్వాత ఇంకెన్ని వివాదాలను కొనితెచ్చుకుంటుందోనన్న వాదన కూడా లేకపోలేదు.

అందరు అనుకుంటున్నట్లే వర్మ జీఎస్‌టీని పచ్చిగా తెరకెక్కించాడా?.. లేక ఫిలాసఫీ ప్రధానంగా తెరకెక్కించాడా? అనేది తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X