twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అప్పట్లోనే అమెరికాలో బ్యూటీట్రీట్మెంట్: జయ సినీ జీవితం ఆసక్తికరం!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తమిళనాడు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉండగానే కన్నుమూసిన జయలలిత.... ఒకప్పుడు సినీస్టార్ అనే సంగతి తెలిసిందే. ఒకానొక పీరియడ్లో తమిళం,తెలుగు, కన్నడ, హిందీ చిత్రసీమలో స్టార్ హీరోయిన్‌గా తీరిక లేకుండా బిజీ బిజిగా గడిపారు.

    స్టార్ పెద్ద హీరోయిన్ గా వెలుగు వెలిగిన జయలలిత... తల్లి బలవంతంతో ఇష్టం లేకున్నా 15వ ఏట సినిమా రంగములోకి ప్రవేశించారు. జయలలిత తొలి సినిమా 'చిన్నడ గొంబె' అనే కన్నడ చిత్రం. జయలలిత తొలి తెలుగు సినిమా 'మనుషులు మమతలు'.

    హీరోయిన్ గా ఎంతో డబ్బు, పేరు సంపాదించినా... ఆమె జీవితం మాత్రం అనుకున్నంత సంతోషంగా, సాఫీగా సాగలేదు. పరిస్థితుల కారణంగా ఒకానొక సందర్భంలో తీవ్రమనస్తాపానికి గురైన ఆమె మూడేళ్ల పాటు సినిమాలకు దూరమయ్యారు. మళ్లీ మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ గా హవాకొనసాగించారు.

    తల్లి మరణంతో ఒంటరి

    తల్లి మరణంతో ఒంటరి

    జయలలిత సినిమా రంగంలో బిజీగా గడుపుతుంటే.... ఆమెకు సంబంధించిన వ్యవహారాలన్నీ ఆమె తల్లి సంధ్య చూసుకునేవారు. ఆమె మరణం తర్వాత జయ ఒంటరిదైంది. నేను ఏమాత్రం బరువు బాధ్యతలు తెలియకుండా పెరిగా. అందుకే మా అమ్మ చనిపోగానే నేను షాక్‌కి గురయ్యా. కొన్నాళ్లపాటు కోలుకోలేకపోయా అంటూ ఓ ఇంటర్వ్యూలో జయలలిత చెప్పుకొచ్చారు.

    సినిమాలకు దూరం

    సినిమాలకు దూరం

    అమ్మ పోయిన తర్వాత ఒంటరితనం అలుముకుంది. నా అన్నవారెవరూ లేరు. ఎవరైనా ఉన్నామని చెప్పినా అది నా డబ్బు కోసమే అని అర్థమైపోతోంది. ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి. అదే సమయంలో తమిళ పత్రికలు అసత్య ప్రచారాలు చేసాయి. నేను నటిని కాబట్టే నన్ను సాధిస్తున్నారు కదా అని పరిశ్రమకి దూరమయ్యా(1976 నుండి 1979). ఎన్ని అవకాశాలు వస్తున్నా ఒప్పుకోకుండా, నా ఇంట్లోనే నాకంటూ మరో ప్రపంచాన్ని సృష్టించుకొన్నా అని గతంలో ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జయ తెలిపారు.

    శోభన్ బాబు రూమర్స్

    శోభన్ బాబు రూమర్స్

    తమిళ పత్రికలు జయలలితపై రాసిన రూమర్స్.... శోభన్ బాబుతో ఆమెకు ఉన్న ఎఫైర్ గురించే అని టాక్. అప్పట్లో వీరు పీకల్లోతు ప్రేమలో ఉన్నారని, ఇద్దరూ ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చారని తమిళ మీడియాలో ప్రచారం జరిగింది.

    ఆ వ్యక్తి ఎంజీఆర్ అని టాక్?

    ఆ వ్యక్తి ఎంజీఆర్ అని టాక్?

    ఎడారిలో ఒయాసిస్‌లా సినీ పరిశ్రమకి చెందిన ఓ ప్రముఖ వ్యక్తి(ఎంజీఆర్?)తో నాకు పరిచయం ఏర్పడింది. ఆయన కూడా నాకు ధైర్యం చెప్పి మళ్లీ నన్ను మామూలు మనిషిని చేశారు అని జయలలిత ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

    అమెరికా వెళ్లి బ్యూటీ ట్రీట్మెంట్

    అమెరికా వెళ్లి బ్యూటీ ట్రీట్మెంట్

    మూడేళ్లు సినిమాలకు దూరం కావడంతో జయలలితలో గ్లామర్ తగ్గింది. తర్వాత అమెరికా వెళ్లి బ్యూటీ ట్రీట్మెంట్ చేయించుకుని మళ్లీ సినిమాల్లో తన హవా కొనసాగించింది. అమెరికా బ్యూటీ ట్రీట్మెంట్ గురించి జయలలిత స్వయంగా వెల్లడించారు.

    నా జీవితానికి సింబాలిక్‌గా అనిపించింది

    నా జీవితానికి సింబాలిక్‌గా అనిపించింది

    తిరిగి సినిమాల్లోకి వెళ్లాలనుకున్న సమయంలో తమిళ చిత్ర నిర్మాత వేణుగోపాల్‌ చెట్టియార్‌ వచ్చి‘నదియ తేడి వంద కడలిల్‌' అనే చిత్రంలో నటించమని అడిగారు. ఆ పేరుకు తెలుగులో ‘నదిని వెదుక్కుంటూ వచ్చిన సముద్రం' అని అర్థం. ఆ పేరు వినగానే నా జీవితానికి సింబాలిక్‌గా అనిపించింది. చిత్ర పరిశ్రమను సముద్రంతోనూ, నన్ను ఒక చిన్న నదిగానూ పోల్చుకొన్నాను అని జయలలితో పత్రిక ఇంటర్వ్యూలో తెలిపారు.

    తెలుగులో దురదృష్టం కొద్దీ

    తెలుగులో దురదృష్టం కొద్దీ

    కథతో పాటు, నా పాత్ర ఎలా ఉందని చూసుకొనే సినిమాల్ని ఎంపిక చేసుకొంటా. తెలుగులో నేను 30కిపైగా చిత్రాలు చేశా. అయితే నా దురదృష్టంకొద్దీ అన్నీ గ్లామర్‌ పాత్రలే లభించాయి. నటిగా నా ప్రతిభని నిరూపించుకొనే పాత్రలేవీ తెలుగులో లభించలేదు. కానీ తమిళంలో మాత్రం ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకొన్నా. అవార్డులు కూడా సాధించాను అని అప్పట్లో ఓ పత్రిక ఇంటర్వ్యూలో జయలలిత తెలిపారు.

    English summary
    Jayalalitha cine journey interesting... check out details.Jayalalithaa Jayaraman was an Indian actor and politician who served five terms as the Chief Minister of Tamil Nadu, for over fourteen years between 1991 and 2016.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X