twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జయలలిత కోసం శోభన్ బాబు తపించాడు... కానీ చివరకు ఏమైందంటే?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: జయలలిత మరణంతో ఆమె అభిమానులంతా శోక సముద్రంలో మునిగిపోయారు. జయలలిత సినీ రంగానికి చెందిన వ్యక్తి కావడం, తెలుగు సినిమాలతో ఆమెకు విడదీయరాని బంధం ఉండటంతో పలువురు సిన ప్రియులు అప్పటి రోజులను గుర్తు చేసుకుంటున్నారు.

    ముఖ్యంగా తెలుగు నటుడు శోభన్ బాబుతో జయలలిత అనుబంధం గురించి ఎవరూ మరిచిపోలేరు. వారి మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే అని కొందరు, లేదు వారి మధ్య ప్రేమ బంధం కొంతకాలం పాటు సాగిందని మరికొందరు అంటుంటారు.

    జయలలిత మృతికి ఇక్కడ నివాళులు అర్పించండి

    అప్పట్లో శోభన్ బాబు తెలుగు సినీ పరిశ్రమలో సోగ్గాడిగా, గొప్ప అందగాడిగా గుర్తింపు తెచ్చకున్నారు. అప్పట్లో అమ్మాయిల్లో ఆయనకు ఉన్న ఫాలోయింగ్ మరే హీరోకు లేదు. ఎంతో మంది అమ్మాయిలకు శోభన్ బాబు నిద్రలేకుండా చేసాడు. అయితే జయలలిత మాత్రం శోభన్ బాబుకు నిద్రలేకుండా చేసాడు. అవును... నిజమే! అప్పట్లో జయలలిత అంటే శోభన్ బాబుకు ఏదో తెలియని వ్యామోహం ఉండేది. ఆమెతో కలిసి నటించాలని దాదాపు 8 ఏళ్లు ఎదురు చూసాడు.

    మొదట్లో నిరాకరణే

    మొదట్లో నిరాకరణే

    జయలలిత స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న రోజుల్లో.... అప్పుడప్పుడే ఎదుగుతున్న శోభన్ బాబుతో కలిసి ఓసినిమా చేసేందుకు అప్పట్లో ఓ నిర్మాత ప్రయత్నించాడు. శోభన్ బాబును కలిసి ఓ నిర్మాత వెయ్యిరూపాయల అడ్వాన్స్ ఇచ్చి నా సినిమాలో నువ్వే హీరో, జయలలిత హీరోయిన్ అని చెప్పి శోభన్ బాబులో ఆశలు రేపాడు. అప్పటికి శోభన్ బాబు చిన్న హీరో కావడంతో ఆమె తల్లి సంధ్య ఈ సినిమా చేయడానికి నిరాకరించారు.

    తపించాను అంటూ శోభన్ బాబు

    తపించాను అంటూ శోభన్ బాబు

    ఓ సందర్భంలో శోభన్ బాబు... జయలలిత గురించి మాట్లాడుతూ ‘అప్పట్లో స్టార్ హీరోయిన్ జయలలిత పక్కన నాకు అవకాశం అంటే అదృష్టంగా భావించాను. అప్పటికి నేను ఆమెను చూడలేదు. ఆమెను చూడాలని తపించాను. తపించాననడం కంటే తపస్సు చేశాననే అనాలి. ఆమెతో నటిస్తున్నానని కనిపించని వారికి కూడా చెప్పుకున్నాను. కానీ ఆమె సినిమా అని చెప్పి నిర్మాత కనిపించకుండా పోయాడు. తర్వాత ఏనిమిదేళ్ల తర్వాత ఆమెతో చేసే అవకాశం వచ్చింది అని శోభన్ బాబు తెలిపారు.

    డాక్టర్ బాబు మూవీతో జయలలితతో

    డాక్టర్ బాబు మూవీతో జయలలితతో

    ‘డాక్టర్‌ బాబు' ఈ సినిమాకు శోభన్‌బాబు ఖరారైనా హీరోయిన్‌ ఖరారుకాలేదు. సినీ పత్రికలో జయలలిత ఫొటో చూసిన శోభన్ బాబు నిర్మాతకు ఫోన్‌ చేసి జయలలితను తీసుకోవాలని సూచించారట. జయ కూడా అందుకు అంగీకరించింది. అలా తొలిసారి 1973లో జయలలితను కలిశారు శోభన్‌బాబు. ఈ సినిమా భారీ విజయం సాధించింది.

    శోభన్ బాబుతో అలా చాలా క్లోజ్

    శోభన్ బాబుతో అలా చాలా క్లోజ్

    జయలలిత తల్లిని కోల్పోయాక ఒంటరితనం ఫీలయ్యేది. ఈ క్రమంలో శోభన్ బాబుతో పరిచయం ఆమెలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. శోభన్ బాబు సెన్సాఫ్ హ్యూమర్ జయను మరింత ఆకర్షించింది. అందరికీ దూరంగా లంకంత కొంపలో ఒంటిరిదానిలా బతుకుతున్నా నాకు మీ స్నేహం వల్ల అమ్మలోని ఆత్మీయతను తిరిగి చూస్తున్నట్టు అనిపిస్తోంది అంటూ జయలలిత స్వయంగా చెప్పినట్లు ఓసారి శోభన్ బాబు తెలిపారు.

    పెళ్లి చేసుకోవాలనుకున్నారట

    పెళ్లి చేసుకోవాలనుకున్నారట

    డాక్టర్ బాబు సినిమా దగ్గర నుండే వారిద్దరి ప్రేమ చిగురించిందన అంటుంటారు. తర్వాత ఇద్దరూ కలిసి పలు చిత్రాల్లో నటించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం బాగా ముదిరిందని, ఒక దశలో జయలలిత శోభన్ బాబుని పెళ్లి చేసుకోవాలని భావించారని, అప్పటికే పెళ్ళైన శోభన్ బాబు ఆమెని రెండో భార్యగా చేసుకోవడానికి అంగీకరించారని టాక్. అయితే అప్పట్లో వాళ్ళకి ఒక పాప కూడా పుట్టినట్లు పుకార్లు వచ్చాయి.

    ఎలా దూరం అయ్యారు?

    ఎలా దూరం అయ్యారు?

    ఇద్దరికీ ఓ పాప పుట్టినట్లు రూమర్స్ వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య కొన్ని విబేధాలు వచ్చాయని.... శోభన్ బాబుకుకు దూరమైన జయని ఎంజీఆర్ చేరదీశారని అంటుంటారు. తన రాజకీయ భవిష్యత్తు కోసమే జయ ఎంజీఆర్ కు దగ్గరైందని, శోభన్ బాబును పూర్తిగా మరిచిపోయిందని టాక్. ఎంజీఆర్ తర్వాత జయ రాజకీయంగా, సీఎంగా ఎదిగిన సంగతి తెలిసిందే.

    English summary
    During her movie career, Jayalalitha fell in love with already married actor Shoban Babu. She was caught watching him through binoculars from her residence. Great love it was, but she never got married!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X