తెలుగులో జయలలిత మొదటి చిత్రం అక్కినేనితో: కృష్ణ గూఢచారి 116తో పాపులారిటీ

జయలలిత తెలుగులో 28 చిత్రాల్లో నటించారు. తెలుగులో ఆమె మొదటి చిత్రం మనుషులు, మమతలు కాగా, గూఢచారి 116 ఆమెకు పాపులారిటీని తెచ్చి పెట్టింది.

By Pratap

హైదరాబాద్: తెలుగు సినిమాల్లో నటించిన జయలలితకు తెలుగు ప్రజల్లో కూడా మంచి ఆదరణ ఉంది. తెలుగులో ఆమె 28 చిత్రాల్లో నటించారు. ఆమె మొత్తం 140 చిత్రాల్లో నటించగా వాటిలో తమిళ సినిమాలు 85. ఓ హిందీ చిత్రంలో కూడా నటించారు. ఆమె కన్నడ సినిమాల్లో కూడా నటించారు.

షూటింగులో ఆమె విరామ సమయంలో ఇంగ్లీషు నవలలు చదువుతూ ఉండేవారు. తన 5వ యేటనే భరత నాట్యం నేర్చుకున్న జయలలిత 15వ యేట సినీరంగంలోకి అడుగు పెట్టారు. 1961 నుంచి 1980 వరకు ఆమె సినిమాల్లో నటించారు. తెలుగులో ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వర రావు, కృష్ణ, శోభన్ బాబు వంటి అగ్రశ్రేణి హీరోలతో నటించారు.

Jayalalithaa acted in 28 Telugu films

తెలుగు తెరకు అక్కినేనితో కలిసి 'మనుషులు మమతలు' చిత్రం ద్వారా జయలలిత పరిచయమయ్యారు. తెలుగులో ఆమె ఆఖరి చిత్రం 'నాయకుడు-వినాయకుడు'. ఆ చిత్రంలోనూ అక్కినేని సరసనే నటించారు.

ఎన్టీఆర్‌తో కలిసి గోపాలుడు-భూపాలుడు, చిక్కడు దొరకడు, నిలువుదోపిడి, శ్రీకృష్ణసత్య వంటి 28 చిత్రాలలో ఆమె నటించారు. కృష్ణ నటించిన జేమ్స్‌బాండ్‌ తరహా చిత్రం 'గూఢచారి 116'తో జయకు తెలుగులో పాపులారిటీ వచ్చింది. వ్యాంప్‌ పాత్రలో ఆమె నటన అందర్నీ మెప్పించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X