twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జయలలిత గురించి అప్పుడు తప్పుగా మాట్లాడా..బాధ కలుగుతోంది: రజనీకాంత్

    జయలలితను తాను బాధపెట్టానని, 1996 అసెంబ్లీ ఎన్నికల్లో తన వ్యాఖ్యలవల్లే జయలలితకు ఓటమిపాలైందని రజనీకాంత్‌ అన్నారు.

    By Srikanya
    |

    చెన్నై: జయలలితను తాను బాధపెట్టానని, 1996 అసెంబ్లీ ఎన్నికల్లో తన వ్యాఖ్యలవల్లే జయలలితకు చెందిన అన్నాడీఎంకే పార్టీ ఓటమిపాలైందని సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్‌ అన్నారు. 1996లో జయలలితకు వ్యతిరేకంగా నిలిచానన్న విషయం తనను ఇప్పటికీ బాధపెడు తోందని రజనీ అన్నారు.

    జయలలిత మళ్లీ ఆధికారంలోకి వస్తే తమిళనాడును దేవుడుకూడా రక్షించలేడని ఈ ఎన్నికల సందర్భంగా రజనీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే . పూర్తి వివరాల్లోకి వెళితే...తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు తమిళ చలనచిత్ర నటీనటుల సంఘం సంతాప సభ ఏర్పాటు చేసింది.

    జయలలితతో పాటు ప్రముఖ పాత్రికేయులు చో రామస్వామికి కూడా ఒకే వేదికపై సంతాపసభ ఏర్పాటు చేశారు. చెన్నై కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణ మంటపంలో జరిగిన ఈ కార్యక్రమంలో నటులు రజనీకాంత్‌, విశాల్‌, కార్తీ, గౌతమి, నదియా, వాణిశ్రీ, భారతి, అంబిక, రాధ తదితరులు పాల్గొన్నారు.

    ఓడిపోవటానికి నేనూ కారణమే

    ఓడిపోవటానికి నేనూ కారణమే

    ఈ సందర్భంగా రజనీకాంత్‌ మాట్లాడుతూ.. జయలలితతో తనకున్న పరిచయాన్ని గుర్తు చేసుకున్నారు. 1996లో ఆమె ఎన్నికల్లో ఓడిపోవడానికి తానూ ఓ కారణమన్నారు. విమర్శించి ఆమెను బాధపెట్టానని.. అయినా పెద్ద మనసు చేసుకుని తన కుమార్తె పెళ్లికి వచ్చారని తెలిపారు.

    మించిపోయింది

    మించిపోయింది

    గురువును మించిన శిష్యులు కొందరే ఉంటారు.. అలాంటి వారిలో జయలలిత ఒకరు. తన గురువు ఎంజీఆర్‌ను ఆమె మించిపోయారని రజనీకాంత్‌ కొనియాడారు. జయలలితను రజనీకాంత్‌ కోహినూర్‌ వజ్రంతో పోల్చారు. పురుషాధిక్య సమాజంలో అనేక ఆటుపోట్లకు ఎదురొడ్డి ఆమె ఉన్నత శిఖరాలను అధిరోహించారని, ఆమె ఎదుర్కొన్న సవాళ్లే ఆమెను సానపట్టిన వజ్రంలా మార్చాయన్నారు.

    బరువెక్కిన హృదయంతో..

    బరువెక్కిన హృదయంతో..

    ఇరువురి మధ్య వివాదం ఉన్నప్పటికీ తన కుమార్తె వివాహానికి జయలలిత హాజరుకావడం తనని తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసిందని రజనీకాంత్‌ అన్నారు. కుమార్తె వివాహానికి జయలలితను ఆహ్వానించేందుకు బరువెక్కిన హృదయంతో ఆమె అపాయింట్‌మెంట్‌ కోరానని, ఆమె కలుస్తారని ఊహించలేదన్నారు.

    నటిగా, రాజకీయంగానూ

    నటిగా, రాజకీయంగానూ

    అయితే తనను సాదరంగా ఆహ్వానించిన జయలలిత ఎటువంటి కార్యక్రమాలున్నా వివాహానికి తప్పకుండా హాజరవుతానని మాటిచ్చారని చెప్పారు. ఈత, ఎదురీత జయలలిత నుంచే నేర్చుకోవాలన్నారు. నటిగానూ, రాజకీయంగానూ తన గురువు, ఆరాధ్యదైవం ఎంజీఆర్‌ కంటే సాధికురాలు జయలలిత అని పేర్కొన్నారు. తమిళనాట పురట్చితలైవిగా ఎదిగి ప్రజల గుండెల్లో అమ్మగా చిరస్థాయిగా నిలిపోయారన్నారు.

    వద్దంటూ

    వద్దంటూ

    తన పుట్టినరోజు వేడుకలు జరపవద్దని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ లేఖ రాశారు. ఈనెల 12న బ్యానర్లు, పోస్టర్లు పెట్టవద్దని అభిమానులను కోరారు. ఏటా డిసెంబరు 12న అభిమానులు రజనీకాంత్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. అయితే ఈసారి వద్దంటూ ప్రకటన చేసారు రజనీ

    ఇలాంటి సమయంలో...వద్దు

    ఇలాంటి సమయంలో...వద్దు

    అయితే ఈ సారి... తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత డిసెంబరు 6న కన్నుమూసిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వారం రోజుల పాటు సంతాపదినాలుగా ప్రకటించింది. రాజాజీ హాలు వద్ద అమ్మ భౌతికకాయాన్ని చూసి రజనీకాంత్‌ కంటతడి పెట్టారు. ఈ విషాద సమయంలో పుట్టిన రోజు వేడుకను రద్దు చేసుకోవాలని రజనీకాంత్‌ నిర్ణయించుకున్నారు.

    రజనీ తర్వాత మారారు

    రజనీ తర్వాత మారారు

    1996లో 'జయలలిత అధికారంలోకి వస్తే తమిళనాడును దేవుడు కూడా కాపాడలేడు' అని రజినీకాంత్.. చేసిన ఈ ఒకే ఒక్క వ్యాఖ్య ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో జయ ప్రత్యర్థుల సోలో నినాదంగా మారిపోయింది. అయితే, అదే రజనీకాంత్ 2011లో 'జయలలిత విజయం తమిళనాడును కాపాడింది' అని ప్రకటించడం గమనార్హం.

    రజనీ ఇగో దెబ్బతింది

    రజనీ ఇగో దెబ్బతింది

    ఒకసారి రజనీకాంత్ తన కారులో వెళ్తుండగా ట్రాఫిక్‌ ఆగిపోయింది. ఎందుకు ట్రాఫిక్‌ ఆగిందని రజనీకాంత్ ప్రశ్నించగా.. సీఎం జయలలిత ఆ దారిలో వస్తున్నారని, అందుకే ముందు జాగ్రత్తగా ట్రాఫిక్‌ ఆపేశారని అక్కడున్న ట్రాఫిక్‌ పోలీస్‌ చెప్పాడు. ఆమె ఎంతసేపట్లో వస్తారని రజనీ ప్రశ్నించగా.. తెలియదని, బహుశా అరగంటలో రావచ్చని అతడు సమాధానమిచ్చాడు. మరి అప్పటిదాకా ట్రాఫిక్‌ను పంపించవచ్చుగా అని రజనీ అడిగితే.. ట్రాఫిక్‌ నిలిపివేయాలని తమకు స్పష్టమైన ఆదేశాలున్నాయని అతడు చెప్పాడు.

     వందలాదిగా జనం

    వందలాదిగా జనం

    దీంతో రజనీ ఒక్క క్షణం ఆలోచించి.. కారులోంచి దిగి సమీపంలో ఉన్న బడ్డీకొట్టు దగ్గరికి వెళ్లి సిగరెట్‌ కొని వెలిగించాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న స్తంభానికి ఆనుకుని సిగరేట్ తాపీగా తాగడం మొదలుపెట్టారు. అసలే తమిళనాడులో రజినీకి ఉన్న కేజ్రీ అంతాఇంతా కాదు. ఏకంగా తమ వీధుల్లోకి వచ్చేసరికి ప్రజలు వందలాదిగా తరలివచ్చారు.

    ఆమెను ఇరికించాడు ట్రాఫిక్ లో ..

    ఆమెను ఇరికించాడు ట్రాఫిక్ లో ..

    క్షణాల్లో అక్కడ వేలాది మంది గుమిగూడారు. దీంతో ఆ దారిలో వస్తున్న జయలలిత ట్రాఫిక్‌ జామ్‌లో చిక్కుకుపోయారు. ఇలా గతంలో జయను కొంత వ్యతిరేకించిన రజనీకాంత్.. తర్వాత కాలంలో ఆమెకు మద్దతుగా నిలిచారు.

    English summary
    Rajinikanth's denouncement of J Jayalalithaa and her politics during the 1996 Tamil Nadu assembly election campaign caused her distress and defeat, actor Rajinikanth said on Sunday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X