twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘జయమ్ము నిశ్చయమ్మురా’ : ట్రిమ్ చేసాం...కానీ మీ కోసమే, మీరు చెప్పారనే

    రాంగోపాల్ వర్మ శిష్యుడు శివ రాజ్ కనుమూరి స్వీయ దర్శకత్వంలో శ్రీనివాస రెడ్డి హీరోగా తెరకెక్కి మొన్న శుక్రవారం రోజు రిలీజైన ‘జయమ్ము నిశ్చయమ్మురా' కు ట్రిమ్ చేసి లెంగ్త్ తగ్గించారు.

    By Srikanya
    |

    హైదరాబాద్ : సినిమా రిలీజ్ అయ్యాక మౌత్ టాక్, రివ్యూలను బట్టి....సినిమాని ట్రిమ్ చేయటం లేదా కొత్త సీన్స్ కలపవటం వంటివి చేస్తూంటారు. అయితే ట్రిమ్ చేస్తున్నారంటే అర్దం..జనాలకు పెద్దగా పట్టలేదని అని అర్దమవుతూంటుంది. ఈ వారం రిలీజైన రెండు చిత్రాలలో ఒకటైన జయమ్ము నిశ్చయమ్మురా కి ఇలాగే కోత పడింది.

    కమిడియన్ నుంచి హీరోగా మారిన శ్రీనివాస్ రెడ్డి-పూర్ణ జంటగా తెరకెక్కిన "జయమ్ము నిశ్చయమ్ము రా" రెండు రోజుల క్రితం శుక్రవారం నాడు విడుదలైంది. సినిమాలో ఆసించిన మేరకు కామెడీ లేదని, స్లోగా ఉందని రిమార్కులు ఓ ప్రక్క అచ్చ తెలుగు చిత్రం, ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ చాలా కాలం తర్వాత చూసాం అంటూ మరో ప్రక్క వినపడుతున్నాయి.

    అయితే చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు, విమర్శకులు "సినిమా చాలా బాగుంది" కానీ.. 'లెంగ్త్' కాస్త ఎక్కువయిందని ఇనానమస్ అభిప్రాయాల్ని వెల్లడిస్తున్నారు. వారి అభిప్రాయాల్ని గౌరవించిన చిత్ర దర్శకుడు శివరాజ్ కనుమూరి వెంటనే సినిమా నుంచి 15 నిమిషాల నిడివి తొలగించామని చెప్తున్నారు.

    Jayammu Nischayammu Raa trimmed by 15 minutes

    చిత్ర దర్శకుడు శివరాజ్ కనుమూరి మాట్లాడుతూ.. "మా సినిమా విడుదలకు రెండ్రోజుల ముందే "పబ్లిక్ ప్రీమియర్స్" నిర్వహించాము, ఆ ప్రీమియర్స్ కి మా మీడియా మిత్రులను కూడా ఆహ్వానించాం. సినిమా చూసిన వాళ్ళందరూ "సినిమా చాలా బాగుంది" అంటూ మా యూనిట్ ని అభినందించారు. అయితే.. ఈ చిత్రాన్ని చూసిన మీడియా మిత్రుల సలహా మేరకు 15 నిమిషాల నిడివి మేరకు సినిమాను కత్తిరించాము.

    ఇప్పటికే మా చిత్రాన్ని విశేషంగా ఆదరిస్తున్న ప్రేక్షకులు.. నిడివి తగ్గించిన తర్వాత పోసాని-కృష్ణ భగవాన్ ల కామెడీ ఎపిసోడ్స్, జోగి బ్రదర్స్ పంచ్ డైలాగ్స్ ను ప్రేక్షకులు ఇంకా బాగా ఎంజాయ్ చేసేలా ఉంటుంది.

    సినిమా చూసినవారందరూ "అచ్చమైన తెలుగు సినిమా చూసిన భావన కలుగుంది" అంటూ సోషల్ మీడియాలో మా సినిమాపై ప్రశంసలు కురిపించడమే కాకుండా చాలా రోజుల తర్వాత కుటుంబ సభ్యులందరు కలిసి మా చిత్రాన్ని చూస్తున్నందుకు మా సినిమా యూనిట్ తరపు నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం" అన్నారు.

    English summary
    Taking the feedback from the audience, Jayammu Nischayammu Raa makers right away have edited fifteen minutes of the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X