twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ సినిమాతో అప్పుల పాలయ్యాను, తీన్ మార్ కూడా చేదు అనుభవమే: జయంత్ సి.పరాన్జీ

    చాలారోజులుగా వార్తలకు దూరంగా ఉన్న పరాన్జీ ఈ మధ్య ఒక వెబ్ చానెల్ కి ఇంటర్వ్యూ లో గత సినిమాల విషాలలో ఫ్లాపులని గుర్తు చేసుకుంటూ ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు దుమారం రేపేలా ఉన్నాయి..

    |

    Recommended Video

    పవన్, మహేష్ సినిమాతో అప్పుల పాలయ్యాను..

    జయంత్ సి.పరాన్జీ టాలీవుడ్ లో ప్రేమించుకుందాం రా..!, బావగారు బాగున్నారా... ఇలాంటి రా ఎండింగ్ సెంటిమెంట్ టైటిళ్ళతో పాటు ఆయన తెలుగు ఇండస్ట్రీకి ఇచ్చిన పెద్ద హిట్స్ కూడా ఙ్ఞాపకం వస్తాయి. చాలారోజులుగా వార్తలకు దూరంగా ఉన్న పరాన్జీ ఈ మధ్య ఒక వెబ్ చానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు.

    టక్కరి దొంగ, తీన్ మార్

    టక్కరి దొంగ, తీన్ మార్

    తన పర్సనల్ విశయాలతో పాటు చాలా సినిమాల అనుభవాలనీ ఈ డైరెక్టర్ నవ్వుతూ పంచుకున్నారు.. అక్కడి వరకూ బాగానే ఉంది కానీ తన గత సినిమాల విషాలలో ఫ్లాపులని గుర్తు చేసుకుంటూ ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు దుమారం రేపేలా ఉన్నాయి... తన కెరీర్లో భారీ ఫ్లాపుల విషయం చెబుతూ టక్కరి దొంగ, తీన్ మార్ ల నాటి అనుభవాలను మళ్ళీ గుర్తు చేసుకున్నాడు ఈ దైరెక్టర్.

    అది అంతగా నాపై ప్రభావం చూపించదు

    అది అంతగా నాపై ప్రభావం చూపించదు

    అప్పుడెలా ఉన్నారో ఇప్పుడూ అలాగే కనిపిస్తున్నారు. ఎలా సాధ్యం? అన్నప్రశ్నకి సమాధానంగా "ఏ విషయంలోను మెంటల్ టెన్షన్ తీసుకోను .. సినిమా ప్లాప్ అయినా అది అంతగా నాపై ప్రభావం చూపించదు" అని అని చెప్పిన జయంత్. " 'టక్కరి దొంగ' సినిమా భారీ నష్టాన్ని తీసుకొచ్చింది .. అప్పుడు కూడా బ్యాలెన్స్డ్ గానే వున్నాను.

     ఏం చేస్తాం .. అలా జరిగిపోయింది

    ఏం చేస్తాం .. అలా జరిగిపోయింది

    ఏంటి .. ఇలా నవ్వుతూ ఎలా ఉండగలుగుతున్నారు? అని చాలామంది అడిగారు. కానీ ఏం చేస్తాం .. అలా జరిగిపోయింది. ఆ విషయాన్ని నేను పెద్దగా పట్టించుకోకుండా 'ఈశ్వర్' షూటింగుకి వెళ్లిపోయాను. 'టక్కరి దొంగ' ప్లాప్ కావడంతో ఆ అప్పులు తీర్చడానికి నాలుగేళ్లు పట్టింది" అయినా బ్యాలెన్స్డ్ గా ఉండగలిగాను అని చెప్పారు.

    ఆయన ఉద్దేశ్యం వేరు అయినా

    ఆయన ఉద్దేశ్యం వేరు అయినా

    అయితే జయంత్ తాను ఎంత టెన్షన్ ఫ్రీగా ఉంటారో చెప్పటం మాత్రమే ఆయన ఉద్దేశ్యం అయినా... ఆ డిజాస్టర్ని మళ్ళీ గుర్తు చేయటం పాపం మహేష్ ఫ్యాన్స్ ని కాస్త ఇబ్బందిపెట్టింది... జయంత్ ఆ తర్వాత పేల్చిన బాంబుకి మాత్రం పవర్ స్టార్ ఫ్యాన్స్ పాపం విలవిల్లాడి పోయారు.

     చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్

    చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్

    "తీన్ మార్" సినిమా నాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ను ఇచ్చింది. ఆ సినిమాను ఉన్నది ఉన్నట్టుగా చేయవలసి వచ్చింది. అంతకుముందు చేసిన 'లక్ష్మీ నరసింహా' .. ' శంకర్ దాదా' సినిమాలు రీమేక్ లే అయినా, తెలుగు ఆడియన్స్ మైండ్ సెట్ ప్రకారం కొన్ని మార్పులు చేశాను.

    ఆ టైమ్‌లో అలా చేయాల్సి వచ్చింది

    ఆ టైమ్‌లో అలా చేయాల్సి వచ్చింది

    'తీన్ మార్' కి ఎలాంటి మార్పులూ చేయలేదు. వున్నది వున్నట్టుగా తీయవలసి వచ్చింది. అప్పుడే నాకు తెలుసు, ఆ సినిమా ఆడదని. తప్పలేదు ఆ టైమ్‌లో అలా చేయాల్సి వచ్చింది..'' అంటూ తీన్‌మార్ విషయంలో తను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని వెల్లడించారు... ఈ విషయం లో "అసలు ఇక మళ్ళీ రీమేక్ లు చేయను" అని అప్పట్లోనే చెప్పారు కూడా.

    అభిమానుల ఆగ్రహాం

    అభిమానుల ఆగ్రహాం

    ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని తనకు ముందే తెలుసని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారాన్ని రేపుతున్నాయి. మరి తెలిసి కూడా అంత పెద్ద హీరో అవకాశం ఇస్తే ఎందుకలా ప్లాప్ సినిమా తీశారంటూ సోషల్ మీడియాలో పవన్ అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అది తప్పనిపరిస్థితి అని జయంత్ ఒప్పుకున్నా అభిమనులకు మాత్రం అసహనం తగ్గటం లేదు.....

    English summary
    Tollywood Director jayanth c. Pranjee rememberd about, His Flop Movies wich has he Done with Mahesh babu " Takkari donga" and Pawan kalyan's Teen maar
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X