twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్‌‌కి ‘తీన్‌మార్’ఇచ్చి మాయం: మంత్రి గంటా కొడుకు హీరోగా... (ఫోటోలు)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు రవి గంటా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తెలుగులో చివరగా పవన్ కళ్యాణ్‌‌తో 'తీన్‌మార్' చిత్రం చేసిన దర్శకుడు జయంత్ సి.పరాన్జీ దాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ టాలీవుడ్లో సినిమా చేస్తున్నాడు.

    ప్రశాంత్‌ సమర్పణలో శారద ఆర్ట్స్‌ బ్యానర్‌పై అనిల్‌కుమార్‌ కిశన్‌ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈచిత్రానికి 'కాళహస్తి' అనే టైటిల్ పెట్టారు. గురువారం హైదరాబాద్‌ రామానాయుడు స్టూడియోలో సినిమా ప్రారంభమైంది.

    ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు, దగ్గుబాటి అభిరాం, ప్రముఖ నిర్మాత అశోక్‌ కుమార్‌, దర్శకుడు జయంత్‌ సి.పరాన్జీ, నిర్మాత అనిల్‌ కుమార్‌ కిశన్‌ తదితరులు పాల్గొన్నారు.

    ''మంచి కోసం దూసుకెళ్తా..ఎవడు అడ్డొచ్చినా తాటతీస్తా' అనే డైలాగ్‌ను ముహుర్తం షాట్‌గా చిత్రీకరించారు. తొలి సన్నివేశానికి ప్రముఖ నిర్మాత డి.సురేష్‌ బాబు క్లాప్‌కొట్టారు. ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు కెమెరా స్విచ్చాన్‌ చేయగా, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు

    స్లైడ్ షోలో సినిమా ప్రారంభోత్సవానికి ఫోటోలు...

    ఇన్నాళ్లు ఎటుపోయారంటే..

    ఇన్నాళ్లు ఎటుపోయారంటే..

    దర్శకుడు జయంత్‌ సి.పరాన్జీ మాట్లాడుతూ - ''చాలా కథలు విన్నాను. అన్నీ నాకు రొటీన్‌గా అనిపించాయి అందుకే ఇన్నాళ్లు సినిమాలు చేయలేదు' అన్నారు

    దీన్ రాజ్ కథ నచ్చింది

    దీన్ రాజ్ కథ నచ్చింది

    ఈ మధ్య ధీన్‌రాజ్‌గారు చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. రియలిస్టిక్‌ కథ. సూపర్‌హీరో కథ కాదు. ఓ జెన్యూన్‌, రియల్‌ హీరో కథ వినగానే ఇలాంటి కథే నాకు కావాలనిపించిందని దర్శకుడు తెలిపారు.

    రవి లాంటి వ్యక్తే నా సినిమాకు కావాలి.

    రవి లాంటి వ్యక్తే నా సినిమాకు కావాలి.

    ధీన్ రాజ్ చెప్పిన కథకు సరైన హీరో కోసం వెతుకుతుండగా రవి కలిసాడు. నా కథకు ఇలాంటి హీరోనే కావాలనుకున్నాను. సినిమా చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంద అన్నారు.

    హ్యాపీ, గర్వం

    హ్యాపీ, గర్వం

    రవి లాంటి ఓ హీరోను పరిచయం చేస్తున్నందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఫీలవుతున్నాను అని దర్శకుడు తెలిపారు.

    థ్రిల్లింగ్, యాక్షన్

    థ్రిల్లింగ్, యాక్షన్

    సినిమా విషయానికి వస్తే ప్రేక్షకులను థ్రిల్‌ చేసే మంచి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. ప్రదీప్ రావత్, ముఖేష్ రుషి, తనికెళ్ళ భరణి, పోసాని వంటి భారీ స్టార్ క్యాస్ట్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారని దర్శకుడు తెలిపారు.

    భక్తిరసం కాదు..

    భక్తిరసం కాదు..

    మాటల రచయిత హర్షవర్ధన్‌ మాట్లాడుతూ - ''కాళహస్తి పేరు వినగానే భక్తిరస చిత్రం అనుకోవద్దు. మంచి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. గుండె జారి గల్లంతయ్యిందే, మనం వంటి డిఫరెంట్‌ చిత్రాలు తర్వాత నేను మాటలు అందిస్తున్న మరో డిఫరెంట్‌ మూవీ ఇది అన్నారు.

    హీరో రవి ఘంటా మాట్లాడుతూ

    హీరో రవి ఘంటా మాట్లాడుతూ

    'ఇలాంటి మంచి సినిమాలో పార్ట్‌ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. నా డెబ్యూ మూవీని జయంత్‌గారి వంటి డైరెక్టర్‌తో చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ప్రేక్షకుల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను' అన్నారు.

    నటీనటులు

    నటీనటులు

    ప్రదీప్‌ రావత్‌, ముఖేష్‌ రిషి, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి, ఐశ్వర్య, ఝాన్సీ, సత్యకృష్ణ, సమీర్‌ తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్నారు.

    తెరవెనక

    తెరవెనక

    ఈ చిత్రానికి ఆర్ట్‌: కృష్ణమాయ, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, మాటలు: హర్షవర్ధన్‌, కథ: దీన్‌రాజ్‌, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, సినిమాటోగ్రఫీ: జవహర్‌ రెడ్డి.యం.ఎన్‌, నిర్మాత: అనిల్‌ కుమార్‌ కిశన్‌, దర్శకత్వం: జయంత్‌ సి.పరాన్జీ.

    English summary
    Andhra Pradesh Education minister Ghanta Srinivasa Rao's son Ravi Ghanta is making his debut as hero with a movie titled 'Kaalahasthi'. Jayanth C Paranjee, who earlier directed movies like 'Preminchukundaam Raa', 'Premante Idhera', 'Takkari Donga', 'Eeshwar', 'Lakshmi Narasimha' etc, is directing this movie, produced by Anilkumar Kishen.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X