పవన్ 'తీన్ మార్' దర్శకుడి కొత్త చిత్రం డిటేల్స్
హైదరాబాద్ : పవన్ తో ' తీన్ మార్' చిత్రం డైరక్ట్ చేసిన జయంత్ సి పరాంన్జీ మరో చిత్రానికి రెడీ అవుతున్నారు. అయితే ఈ సారి తెలుగులో కాదు..కన్నడంలో చిత్రం చేయనున్నారు. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హీరోగా ఈ చిత్రం రూపొందనుంది. పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ గా చిత్రం రూపొందనుందని సమాచారం. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ కి వెళ్ళనుంది.
ఇక జయంత్ తెలుగులో దాదాపు పెద్ద హీరోలందరితో చేసిన అనుభవం ఉంది. మెగాస్టార్ చిరంజీవితో బావగారూ బావున్నారా, బాలకృష్ణతో లక్ష్మీ నరసింహా,అల్లరి పిడుగు, వెంకటేష్ తో ప్రేమించుకుందాం రా,మహేష్ తో టక్కరి దొంగ, ప్రబాస్ తో ఈశ్వర్ వంటి చిత్రాలు చేసారు. అయితే తీన్ మార్ పరాజయం తర్వాత తెలుగులో ఆపర్స్ లేక కన్నడంకి వెళ్లారు.
మరో ప్రక్క జయంత్....నిర్మాతగా అవతారమెత్తి రూపొందించిన మరో ప్రేమకథా చిత్రం 'లవ్ ఫర్ ఎవర్'. 'లాఫింగ్ వాటర్స్' బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా రణదీప్, మృదుల హీరో హీరోయిన్లుగా పరిచయమౌతున్న సంగతి తెలిసిందే! ఇటీవలే 35 రోజుల పాటు న్యూజిల్యాండ్ లో జరిగిన షెడ్యూల్ తో షూటింగ్ పూర్తయింది. బాలీవుడ్ భామ దీపిక పదుకొనే చేసిన ప్రత్యేక గీతం హైలెట్ గా వస్తున్న ఈ చిత్రం ఇప్పటివరకూ ప్రేక్షకుల ముందుకు రాలేదు.


Click it and Unblock the Notifications












