లవ్4ఎవర్!!
ప్రేమించుకుందాం..రా, బావగారూ బాగున్నారా, శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు జయంత్ సి పరాంజీ కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నాడు. జయంత్ మళ్లీ సినిమా తీయడానికి సిద్ధమయ్యాడు. తాజాగా ఆయన దర్శకత్వం వహించనున్న సినిమా లవ్4ఎవర్. రణదీప్, షాలీనా అనే నూతన తారలు హీరోహీరోయిన్లుగా ఈ సినిమా ద్వారా పరిచయం కానున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ భాషలలో నిర్మితం కానున్నది. లాఫింగ్ వాటర్ ఎంటర్ టైన్మెంట్ అనే నూతన పతాకంపై ఈ సినిమా రూపొందనున్నది. ముంబైకి చెందిన రామ్ సంగీతాన్ని అందించనున్నారు. హైదరాబాద్, న్యూజిలాండ్ లలో సినిమా షూటింగ్ జరగనున్నది.


Click it and Unblock the Notifications