పవన్ కళ్యాణ్ లో ఫైర్ పెంచిన దర్శకుడు...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'ఖుషి", 'జల్సా" చిత్రాలు అతని కెరియర్ లో మంచి సినిమాలుగా నిలిచిపోయాయి. 'కొమరం పులి" ప్లాప్ తర్వాత పవన్ చేయబోయే తదుపరి చిత్రం ఎలా ఉంటుందోనని పవర్ స్టార్ అభిమానులు భయపడుతున్నారు. కానీ ప్రస్తుతం పవన్ చేస్తున్న 'లవ్ లీ" చిత్రం స్టిల్స్ విడుదలయ్యాయి. ఈ స్టిల్స్ బాగున్నాయనీ, పవన్ లో 'ఖుషీ", 'జల్సా" చిత్రాల్లోని పైర్ కనబడుతోందని, ఖచ్చితంగా ఈ సినిమా హిట్టేనని పవర్ స్టార్ అభిమానుల్లో ఆశలను మరింత పెంచాయిని తెలుస్తోంది. దర్శకుడు జయంత్ కూడా ఈ సినిమాని చక్కగా తీర్చిదిదత్తుతున్నాడని సమాచారం.


Click it and Unblock the Notifications











