twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Actress Jayanthi death.. నా తల్లి మరణానికి కారణం అదే.. కన్నీరుమున్నీరైన జయంతి కుమారుడు

    |

    దక్షిణాది చిత్ర పరిశ్రమలో 60 దశకం నుంచి అందం, అభినయంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ప్రముఖ నటి జయంతి జూలై 26 ఉదయం అంటే సోమవారం బెంగళూరులో మరణించారు. గత కొద్దికాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. తన నివాసంలోనే చికిత్స పొందున్న జయంతి నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. ఈమె మరణ వార్తతో దిగ్బ్రాంతికి లోనైన, సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. జయంతి వ్యక్తిగత వివరాల్లోకి, మరణానికి సంబంధించిన విషయంపై ఆమె కుమారుడు వెల్లడించినది ఏమిటంటే...

    Actress Jayanthi Passes away: విషాదంలో దక్షిణాది సినీ పరిశ్రమ.. ఆ స్టార్ హీరోతో 30 సార్లు!Actress Jayanthi Passes away: విషాదంలో దక్షిణాది సినీ పరిశ్రమ.. ఆ స్టార్ హీరోతో 30 సార్లు!

    గతంలో జయంతి మరణంపై రూమర్లు

    గతంలో జయంతి మరణంపై రూమర్లు

    తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న జయంతి మరణించారని లాక్‌డౌన్ సమయంలో రూమర్లు వచ్చాయి. మీడియాలో వచ్చిన వార్తలను ఆమె కుమారుడు కృష్ణకుమార్ ఖండించారు. తన తల్లి ఆరోగ్యం బాగానే ఉంది. ఆమె ఆరోగ్యం విషయంలో ఆందోళన పడాల్సిన అవసరం లేదు అని అన్నారు. ఆ తర్వాత కోలుకొన్నట్టే కనిపించిన జయంతి అభిమానులను విషాదంలోకి నెట్టి సోమవారం తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.

    Jayanthi no more: ఆమెకు వచ్చిన అవార్డులు.. తెలుగులో నటించిన గొప్ప చిత్రాలు ఇవేJayanthi no more: ఆమెకు వచ్చిన అవార్డులు.. తెలుగులో నటించిన గొప్ప చిత్రాలు ఇవే

    జయంతి మరణంపై కుమారుడు

    జయంతి మరణంపై కుమారుడు

    నటి జయంతి మరణం గురించి ఆమె కుమారుడు కృష్ణ కుమార్ సోమవారం మీడియాకు ధృవీకరించారు. అనారోగ్యం నుంచి కోలుకొంటున్నారని అనుకొన్నాం. కానీ నా తల్లి నిద్రలోనే తుదిశ్వాస విడిచారు అంటూ కృష్ణ కుమార్ విషాదంలో మునిగిపోయారు. ఆమె అంత్యక్రియల గురించి వివరాలను త్వరలోనే మీడియాకు వెల్లడిస్తామని చెప్పారు.

    కర్ణాటక సీఎం సంతాపం

    కర్ణాటక సీఎం సంతాపం

    జయంతి మృతిపై కర్ణాటక ముఖ్యమంత్రి యాడ్యూరప్ప తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. కన్నడ నటి అభినయ శారద జయంతి బెంగళూరులోని తన నివాసంలో మరణించారు. సినీ పరిశ్రమకు తాను చేసిన సేవలు మరువలేనివి. ఆమె మరణం కన్నడ పరిశ్రమకు తీరని లోటు అని కర్ణాటక సీఎం ట్వీట్ చేశారు.

    నిర్మాత బండ్ల గణేష్ తీవ్ర దిగ్బ్రాంతి

    నిర్మాత బండ్ల గణేష్ తీవ్ర దిగ్బ్రాంతి

    జయంతి మరణ వార్తతో తెలుగు నిర్మాత, నటుడు బండ్ల గణేష్ తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. సీనియర్ జయంతి గారు ఈ లోకం నుంచి వెళ్లిపోయారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఆమె కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకొంటున్నాను అని బండ్ల గణేష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

    Recommended Video

    Surekha Sikri Life Story, నేషనల్ అవార్డ్ నటి.. Naseeruddin Shah కి బంధువు!! || Filmibeat Telugu
    హీరోయిన్‌గా 300 చిత్రాల్లో..

    హీరోయిన్‌గా 300 చిత్రాల్లో..

    జయంతి నట జీవితానికి వస్తే.. మొత్తం ఆరు భారతీయ భాషల్లో నటించారు. హీరోయిన్‌గా 300కుపైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇక క్యారెక్టర్ ఆర్టిస్టుగా మరో 200కుపైగా చిత్రాల్లో నటించారు. తన కెరీర్‌లో 500కుపైగా చిత్రాల్లో నటించారు.

    English summary
    Big Tragedy in South Indian Film Industries. Today Marning Veteran Actress Jayanthi Passes Away Due Health Issues. Her son Krishna Kumar confirmed the news of her death. He revealed that she was recovering from illnesses, but eventually breathed her last during her sleep.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X