బాలకృష్ణ- వాసు చిత్రంలో జయప్రద
బాలకృష్ణ తదుపరి చిత్రంలో ప్రముఖ నటి, లోక్‌సభ సభ్యురాలు జయప్రద గెస్ట్‌రోల్ వేయనున్నారు. లలిత కళాంజలి ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాణం కానున్న ఈ సినిమాకు చంద్రముఖి ఫేం పి వాసు దర్శకత్వం వహిస్తున్నారు. అత్యంత మంగళప్రదమైన ఏప్రిల్ 30న ఈ సినిమా రామానాయుడు స్టూడియోలో లాంఛనంగా ప్రారంభం కానుంది. మీేరా జాస్మిన్, స్నేహ, నవనీత్ కౌర్‌లు బాలకృష్ణ సరసన నటిస్తారు. నరేష్, జయప్రకాష్ రెడ్డి, కోవై సరళ తదితరులు నటిస్తారు. కన్నడంలో ఆప్తమిత్ర వంటి హిట్ చిత్రానికి స్వరాలను సమకూర్చిన గురుకిరణ్ సంగీతం అందిస్తారు. మాటలు తోటపల్లి మధు, ఫోటోగ్రఫీ శేఖర్ వి జోసెఫ్, కళ కుమార్. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం పి వాసు. నిర్మాత వాకాడ అప్పారావు. ఈ సినిమాలో ప్రధాన హీరోయిన్‌గా నయనతారను తీసుకోవాలని దర్శకుడు వాసు భావించినా ఏవో కారణాల వల్లను ఆమెను వద్దనుకుని మీరా జాస్మిన్‌ను ఖరారు చేసుకున్నారు.


Click it and Unblock the Notifications