శ్రీదేవికి ఇగో ప్రాబ్లం: జయప్రద సంచలన కామెంట్!
హైదరాబాద్: ఒకప్పుడు బాలీవుడ్‌ను ఏలిన తెలుగు తారల్లో శ్రీదేవి, జయప్రదలను ప్రధానంగా చెప్పుకోవచ్చు. అప్పట్లో ఈ ఇద్దరికి అస్సలు పడేది కాదు. ఇద్దరూ తెలుగువారే అయినా ఒకరికొకరు ఎదురు పడినా అసలు మాట్లాడుకునే వారు కాదు. 'దేవత' షూటింగ్ సమయంలో నటుడు జితేంద్ర వీరిద్దరి కలిపేందుకు ప్రయత్నించారు. ఇద్దరూ ఒకే గదిలో ఉండగా గడి పెట్టేసారు. రెండు గంటల పాటు అలానే ఉంచేసారు. అయితే ఆయన ప్రయత్నం ఫలించలేదు.
చాలా ఏళ్ల క్రితం జరిగిన ఈ సంఘటన గురించి తాజాగా జయప్రద గుర్తు చేసుకున్నారు. ఎన్నికల సందర్భంగా ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీదేవి ప్రస్తావన రావడంతో ఆమె స్పందించారు. శ్రీదేవితో తనకు మొదటి నుండి సరైన సంబందాలు ఉండేవి కాదని, జయసుధతో ఉన్నంత ఫ్రీనెస్ శ్రీదేవితో ఉండేది కాదని. శ్రీదేవికి ఇగో ప్రాబ్లం అని తెలిపారు వ్యాఖ్యానించారు.

జయప్రద మొదటి నుండి తన రాజకీయ ప్రస్థానాన్ని అమర్ సింగ్‌తో కలిసి కొనసాగిస్తున్నారు. ఇటీవల అమర్ సింగ్ తరుపున శ్రీదేవి వచ్చి ప్రచారం చేసారు. దీనిపై జయప్రద స్పందిస్తూ....'అమర్ సింగ్‌కు శ్రీదేవి మంచి స్నేహితురాలు, అందుకే వచ్చి ప్రచారం చేసారు. నన్ను ఆమెకు పరిచయం చేసినా గుర్తు పట్టనట్లు వ్యవహరించింది అని తెలిపారు. ఇప్పటికీ ఆమెలో ఇగో ప్రాబ్లం తగ్గలేదు' అని వ్యాఖ్యానించారు జయప్రద.
శ్రీదేవిని, తనను జితేంద్ర గదిలో పెట్టిన సంఘటనను గుర్తు చేసుకుంటూ.....మమ్మల్ని ఇద్దరినీ కలిపేందుకు 'దేవత' షూటింగ్ రామానాయుడు స్టూడియోలో జరుగుతుండగా జితేంద్రగారు మేము ఇద్దరం ఒకే గదిలో వెళ్లిన సమయం చూసి గడి పెట్టేసారు. రెండు గంటల పాటు అలానే ఉంచారు. ఆ రెండు గంటలు మేము ఏమీ మాట్లాడుకోలేదు. ఇద్దరం చెరో కిటికీ వైపు కూర్చున్నాం. మమ్మల్ని కలిపేందుకు జితేంద్రగారు చేసిన ప్రయత్నం ఫలించలేదని తెలిపారు.


Click it and Unblock the Notifications











