»   » పెళ్లి సందడి: జయప్రద, జయసుధ, ఇతర స్టార్ల డాన్స్ (ఫోటోస్)

పెళ్లి సందడి: జయప్రద, జయసుధ, ఇతర స్టార్ల డాన్స్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ఎంపీ, ప్రముఖ సినీనటి జయప్రద కుమారుడు సిద్ధార్థ్‌ పెళ్లి వేడుకలో భాగంగా జరిగిన ‘సంగీత్' కార్యక్రమంలో పలువురు స్టార్లు ఉత్సాహంగా గడిపారు. శంషాబాద్‌లోని సుచిర్ టింబర్ లీఫ్‌ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

ఉత్తర్‌ప్రదేశ్ రాజకీయ ప్రముఖుడు అమర్‌సింగ్‌, ప్రముఖ సినీనటులు ఎం.మోహన్ బాబు, మంచులక్ష్మి, జయసుధ, సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ తదితరులు హాజరై సరదాగా స్టెప్పులు వేశారు. ఈనెల 27న హైదరాబాద్‌లో సిద్ధార్థ్‌, ప్రవల్లికా రెడ్డి వివాహం జరగనుంది.

సిద్ధార్థ్ జయప్రద సోదరి కుమారుడు. జయప్రద అతన్ని చిన్నతనంలోనే దత్తత తీసుకుంది. జయప్రద వారసత్వంతో సిద్ధార్థ్ కూడా సినిమాల్లో నటించాడు. తమిళంలో ‘ఉయిరే ఉయిరే' అనే సినిమాలో నటించాడు. ఈ చిత్రంలో హన్సిక హీరోయిన్ గా నటించింది. స్లైడ్ షోలో సిద్ధార్థ్, ప్రవళ్లక రెడ్డిల సంగీత్ కార్యక్రమం ఫోటోస్...

సంగీత్

సంగీత్


జయప్రద కుమారుడు సిద్ధార్థ్ పెళ్లి వేడుకలో అమర్ సింగ్, మోహన్ బాబు, జయసుద, జయప్రదల తదితరులు..

డాన్స్

డాన్స్


సంగీత్ కార్యక్రమంలో జయసుధ, జయప్రద డాన్స్...

లవ్లీ కపుల్

లవ్లీ కపుల్


ఈనెల 27న హైదరాబాద్‌లో సిద్ధార్థ్‌, ప్రవల్లికా రెడ్డి వివాహం జరగనుంది.

అమర్ సింగ్

అమర్ సింగ్


ఉత్తర్‌ప్రదేశ్ రాజకీయ ప్రముఖుడు అమర్‌సింగ్ కూడా ఈ వివాహ వేడుకకు హాజరయ్యాడు.

సరదాగా

సరదాగా


ఎం.మోహన్ బాబు, మంచులక్ష్మి, జయసుధ, సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ తదితరులు హాజరై సరదాగా స్టెప్పులు వేశారు.

మోహన్ బాబు, లక్ష్మి

మోహన్ బాబు, లక్ష్మి


తన కూతురు మంచు లక్ష్మితో కలిసి మోహన్ బాబు ఈ సంగీత కార్యక్రమానికి హాజరయ్యాడు.

శ్రీలేఖ

శ్రీలేఖ


సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ నేతృత్వంలో సంగీత కార్యక్రమం జరిగింది.

శంషాబాద్ లో...

శంషాబాద్ లో...


శంషాబాద్‌లోని సుచిర్ టింబర్ లీఫ్‌ ప్రాంగణంలో బుధవారం జరిగిన ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

English summary
Actress Jayaprada Son Siddharth Sangeet Ceremony held at Shanshabad, HYD.
Please Wait while comments are loading...