twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'భరత్ అనే నేను'.. చూడాల్సిన వ్యక్తే చూశాడు, రివ్యూ ఇచ్చాడు.. జేపీ రియాక్షన్!

    |

    Recommended Video

    Jayaprakash Narayan Watched Bharat ane Nenu

    భరత్ అనే నేను చిత్రం సందేశంతో కూడిన కమర్షియల్ చిత్రంగా ఘనవిజయం సాధించింది. సినీ రాజకీయ ప్రముఖుల నుంచి ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన వస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటన, కొరటాల శివ తెరకెక్కించిన విధానం సినిమాకు ప్రాణం పోశాయి. ఈ విషయాలని పక్కన పెడితే ఈ చిత్రంలో దర్శకుడు కొరటాల శివ లేవనెత్తిన అంశాలు ప్రముఖుల్ని, ప్రేక్షకులని ఆకట్టుకుంటూనే ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. భారత అనే నేను చిత్రంలో కొరటాల శివ క్లిష్టమైన ట్రాఫిక్ సమస్య, ప్రభుత్వ విద్యావిధానం, లోకల్ గవర్నెన్స్ వంటి కీలకమైన అంశాలని చాలా చక్కగా చూపించారు. ఇప్పటి వరకు చాలా మంది సినీ రాజకీయ ప్రముఖులు ఈ చిత్రాన్ని చూసి అభినందించారు. ఆలస్యమైనా ఎట్టకేలకు ఈ చిత్రాన్ని చూడవలసిన వ్యక్తే చూశాడు. ప్రముఖ రాజకీయ వేత్త జయప్రకాశ్ నారాయణ తాజగా భరత్ అనే నేను చిత్రాన్ని చూశారు.

    రాజకీయంతో సినిమా చాలా కష్టం

    రాజకీయంతో సినిమా చాలా కష్టం

    ప్రజాస్వామ్యం, రాజకీయం గురించి సినిమా తీయాలంటే ఈ రోజుల్లో చాలా కష్టం అని జయప్రకాశ్ నారాయణ అన్నారు. నా లాంటి వాళ్ళు చెప్పే అంశాలని సినిమా తీస్తే అది డాక్యుమెంటరీ అవుతుందని జెపి అభిప్రాయపడ్డారు. డివివి దానయ్య, కొరటాల శివ సమక్షంలో ఆయన భరత్ అనే నేను చిత్రాన్ని వీక్షించి మీడియాకు తన అభిప్రాయాలని వెల్లడించారు.

    కోట్లాదిమంది ఆలోచించేలా

    కోట్లాదిమంది ఆలోచించేలా

    కోట్లాదిమందిలో ఆలోచన పెరిగేలా భరత్ అనే నేను చిత్రం దృశ్య కావ్యంలా ఉందని, విజయవంతంగా చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు కొరటాల, నిర్మాత దానయ్యని జెపి అభినందించారు. సినిమా కొంత నాటకీయత ఉంటుందని, అది పక్కన పెడితే కొన్ని అంశాలు తనకు కొన్ని అంశాలు చాలా బాగా నచ్చాయని అన్నారు.

    తాను ముందే చెప్పిన అంశాలు

    తాను ముందే చెప్పిన అంశాలు

    ఈ చిత్రంలో చట్టబద్ధ పాలన, స్థానిక ప్రభుత్వం గురించి దర్శకుడు చాలా అద్భుతంగా చూపించారని జేపీ అన్నారు. ఈ విషయాల గురించి తాను ముందు నుంచే చెబుతున్నాని, ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడానికి దర్శకుడు కొరటాల శివ ప్రయత్నం చేసారని అన్నారు.

     సినిమా చూసి వెళ్లిపోకండి

    సినిమా చూసి వెళ్లిపోకండి

    మంచి సినిమా చూశామని సంతోషంతో అందరూ వెళ్లిపోవద్దని, ఈ చిత్రంలో దర్శకుడు చెప్పిన సామజిక అంశాల గురించి ప్రజలు ఆలోచించాలని జేపీ కోరారు. పాలన హైదరాబాద్ లోని, ఢిల్లీలోని మహా నాయకుల చేతిలో కాదని ప్రజల చేతిలోనే ఉండాలనే అంశం గురించి అంతా ఆలోచించాలని అన్నారు. ఢిల్లీలో ఉన్నవారి హీరోలు కాదని జేపీ అభిప్రాయ పడ్డారు.

    49 పెద్ద దేశాలలో అట్టడుగున

    49 పెద్ద దేశాలలో అట్టడుగున

    ప్రపంచంలోని 49 పెద్ద దేశాలలో ఇండియా అట్టడుగున ఉందని జేపీ అన్నారు. దీనికి కారణం ఇపప్టికి ప్రజల్లో ఓటు గురించి సరైన అవగాహనా లేకపోవడం వలనే అని అభిప్రాయ పడ్డారు.

    మహేష్ అందరిని కొట్టేశాడు

    మహేష్ అందరిని కొట్టేశాడు

    సినిమా కాబట్టి భరత్ పాత్రలో మహేష్ అందరిని కొట్టేశాడని, కానీ నిజజీవితంలో ప్రజలే ఆలోచించాలని అన్నారు. ఈ చిత్రం ద్వారా దర్శకుడు కొరటాల శివ చెప్పదలుచుకున్న అంశం ఇదే అని జయప్రకాష్ నారాయణ అన్నారు.

    English summary
    Jayaprakash Narayana watches Bharat Ane Nenu movie. Jayaprakash Narayana praised movie team.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X