జయప్రకాష్ రెడ్డి, తాగుబోతు రమేష్ గ్యాంగ్నమ్ డాన్స్
హైదరాబాద్: గ్యాంగ్నమ్ స్టైల్ డాన్స్ ఈ మధ్య ప్రపంచ వ్యాప్తంగా తెగ పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఆ మాటకొస్తే ఈ భూప్రపంచం మీద గ్యాంగ్నమ్ స్టైల్ డాన్స్ గురించి తెలియని మనిషి ఉండరని చెప్పడం అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే అంతలా పాపులర్ అయింది ఈ పాట.
తాజాగా తెలుగు కమెడియన్లు జయప్రకాష్ రెడ్డి, తాగుబోతు రమేష్ లు ఈ డాన్స్ తో అలరించనున్నారు. రాజేంద్రప్రసాద్ కథానాయకుడిగా పోల్‌స్టార్ పిక్చర్స్ పతాకంపై రూపొందిస్తున్న 'నూతిలో కప్పలు' చిత్రంలో ఈ ఇద్దరు గ్యాంగ్నమ్ డాన్స్ చేయబోతున్నారు. ఇందులో వీరు ఈ పాటపై మూడు నిమిషాల పాటు డాన్స్ చేయనున్నారు.

గ్యాంగ్నమ్ డాన్స్ చేస్తున్న జయప్రకాష్ రెడ్డి, తాగుబోతు రమేస్, ఇరత మెడియన్లు.

నూతిలో కప్పలు చిత్రంలో వీరు ఈ డాన్స్ పెర్మెన్స్ చేస్తున్నారు.

రాజేంద్రప్రసాద్ కథానాయకుడిగా పోల్‌స్టార్ పిక్చర్స్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రమే ‘నూతిలో కప్పలు'.

పైకిరావు, రానివ్వవు అనే ఉపశీర్షికతో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని చంటి జ్ఞానమణి దర్శకత్వంలో వినయ్, పూనాటి శ్రీను నిర్మిస్తున్నారు.

స్నేహితులు, తల్లిదండ్రులపై వ్యంగ్యమైన విమర్శనాధోరణితో ఈ చిత్రం ఉండనుంది. ఒకరి అభివృద్ధికి మరొకరు ఎలా ఆటంకంగా మారుతున్నారో అనే అంశంతో ఈ చిత్రం రూపొందించారు.
పైకిరావు, రానివ్వవు అనే ఉపశీర్షికతో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని చంటి జ్ఞానమణి దర్శకత్వంలో వినయ్, పూనాటి శ్రీను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పూర్తి వినోదాత్మకంగా రూపొందుతోంది. ప్రస్తుతం సమాజంలో ఉన్న స్నేహితులు, తల్లిదండ్రులపై వ్యంగ్యమైన విమర్శనాధోరణితో ఈ చిత్రం ఉండనుంది. ఒకరి అభివృద్ధికి మరొకరు ఎలా ఆటంకంగా మారుతున్నారో అనే అంశంతో ఈ చిత్రం రూపొందించారు.
మనోజ్ నందం, భరత్, విజయ్ సాయి, రామ్‌తేజ్, జయప్రకాష్‌రెడ్డి, తాగుబోతు రమేష్, అల్లరి సుభాషిణి, సంధ్యా జనక్, అనంత్, పరీసింగ్, దీక్షాపంత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:సాయి కార్తీక్, విశ్వనాధ్, రవిశంకర్, సుబ్బు, సత్య, కెమెరా:మోహన్ రెడ్డి, మాటలు:మహేందర్, ఎడిటింగ్:రామ్స్, నిర్మాతలు:వినయ్, పూనాటి శ్రీను, దర్శకత్వం:చంటి జ్ఞానమణి.


Click it and Unblock the Notifications











