»   » నయనతార‌కు.... డ్రైనేజీ సమస్య తప్పదా?

నయనతార‌కు.... డ్రైనేజీ సమస్య తప్పదా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నయనతార ఇంటికి డ్రైనేజీ సమస్య తప్పేట్లు లేదు. అంతే కాదు నీటి సరఫరా కూడా కట్ చేస్తారట. ఇంటి పన్ను కట్టనందుకుగాను నటుడు జయరాం, నటి నయనతారల ఇంటి వాటర్, డ్రైనేజ్ కనెక్షన్లను కట్ చేయనున్నట్లు ఊటీ కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేసారు. తమిళనాడు నీలగిరి జిల్లా ఊటీ సమీపంలోని లవ్‌టెల్ రోడ్డు రాయల్ కాస్టిల్ అనే ప్రాంతంలో నయనతార నివాసం ఉంది.

నయనతార సినిమాల విషయానికొస్తు...
నయనతా ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళం, మళయాలంలో 9 చిత్రాల్లో నటిస్తోంది. ఇందులో రెండు చిత్రాలు పోస్టు ప్రొడక్షన్ దశలో ఉన్నారు. మరో ఆరు సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. తెలుగులో ఆమె బాలయ్య సరసన డిక్టేటర్ చిత్రంలో నటించబోతోంది.

 Jayaram, Nayanthara are property tax defaulters in Ooty

గతంలో శింబుతో పీకల్లోతు ప్రేమాయణంలో మునిగి నయనతార.....తర్వాత అతనికి దూరమైంది. తర్వాత ప్రభుదేవాతో వ్యవహారం ఆమె జీవితంలో ఓ సంచలనం. ఇద్దరూ పెళ్లి చేసుకునే వరకు వెళ్లారు. నయన కోసం తన భార్యకు విడాకులు కూడా ఇచ్చాడు ప్రభుదేవా. ప్రభుదేవా కోసం నయనతార అప్పట్లో మతం మార్చుకుని సినిమాలను సైతం విడిచిపెట్టింది. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఇద్దరి మధ్య గొడవలు జరిగి విడిపోయారు. కొంత కాలం తర్వాత నయనతాక సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి బిజీ అయిపోయింది.

సెకండ్ ఇన్నింగ్స్‌లోను సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా కొనసాగుతున్న అరుదైన నటీమణుల్లో ఒకరీమె. రాజారాణి, ఆరంభం, ఇదు కదిర్‌వేల్ కాదల్ లాంటి చిత్రాల విజయాలు నయనతారకు సెకండ్ ఇన్నింగ్‌లో చాలా హెల్ప్ అయ్యాయి. ఈ మధ్య వచ్చిన అన్భే నీ ఎంగే చిత్రం నిరాశ పరచినా నటిగా ఆమె కెరీర్‌కు ఎలాంటి ఢోకా లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఈ సంచలన నటి సూర్యతో మాస్, ఉదయనిధి సరసన నన్భేండా, జయంరవికి జంటగా తనీ ఒరువన్ చిత్రాలతో పాటు లేడి ఓరియంటెడ్ చిత్రం మాయ చేస్తూ బిజీగా వున్నారు.

Read more about: nayanthara, నయనతార
English summary
Mollywood stars Jayaram and Nayanthara are among a host of celebrities who have defaulted in paying property tax here.
Please Wait while comments are loading...