బాలకృష్ణ సరసన జయసుధ.. డిటేల్స్

By Srikanya

'అధినాయకుడు" సినిమాలో తొలిసారి బాలకృష్ణగారికి పెయిర్‌గా నటించా. ఆయన సరసన ఎప్పుడో నటించాల్సింది. 'అన్నదమ్ముల అనుబంధం"లో జయమాలిని చేసిన కేరక్టర్‌కి ముందు నన్నే అడిగారు. కానీ అప్పుడు డేట్స్ సర్దుబాటు చేయలేకపోయాను. ఆ తర్వాత 'శివరంజని"లో ముందు బాలకృష్ణనే హీరోగా అనుకున్నారు దాసరి గారు. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదర్లేదు. ఫైనల్‌గా ఈ సినిమాలో ఆయన సరసన చేస్తున్నాను. ఇందులో బాలకృష్ణ తాతగా, తండ్రిగా, కొడుగ్గా త్రిపాత్రాభినయం చేస్తున్నారు. తాత పాత్రకు నేను జోడీ అన్నమాట అంటున్నారు జయసుధ.

'అధినాయకుడు" చిత్రాన్ని కీర్తి కంబైన్స్‌ పతాకంపై ఎమ్మెల్‌ కుమార్‌ చౌదరి నిర్మిస్తు న్నారు. ఈ చిత్రంలో లక్ష్మీరాయ్‌, చార్మి, సలోని హీరోయిన్లుగా నటిస్తున్నారు. కళ్యాణి మాలిక్‌ కంపోజ్‌ చేసిన అన్ని పాటలు చాలా అద్భుతంగా వచ్చా యని అంటున్నారు. ఈ నెలలోనే్ చిత్రం ఆడియో విడుదల కాబోతుందని వినికిడి.శ్రీరామ రాజ్యం వంటి భక్తి రసాత్మక చిత్రం తర్వాత ఔట్‌ అండ్‌ ఔట్‌ కమర్షియల్‌ మూవీగా 'అధినాయకుడు"రాబోతోంది.

దర్శకుడు పరుచూరి మురళి ఈ చిత్రం గురించి.. ప్రజలకు సేవ చేసే నిజమైన నేత, వారి కష్ట సుఖాలలో పాలు పంచుకునే నేత ఎలా ఉండాలో అధినాయకుడు చూపిస్తుందని చెప్పిన మాటలు కూడా మరింత ఆసక్తి పెంచుతున్నాయి. ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ రాజకీయ విశేషాలు కూడా కలగలిసి ఉండవచ్చని పిల్మ్ నగర్ టాక్. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్లుగా సలోని, లక్ష్మి రాయ్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకు షూటింగ్ పూర్తి అయ్యింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X