తాజ్ బంజారాలో జయసుధ కలెక్షన్స్
బంజారాహిల్స్ తాజ్ బంజారా హోటల్ లో జయసుధ కలెక్షన్స్ పేరుతో శనివారం ఎగ్జిబిషన్ ను నిర్వహిస్తున్నారు. ఉదయం పది గంటలకు ప్రారంభం కానున్న ఈ ఎగ్జిబిషన్ తిలకించేందుకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖలు విచ్చేయనున్నారు. ఈ ప్రదర్శనపై జయసుధ మాట్లాడుతూ తాను డిజైన్ చేసిన చీరలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన వైవిధ్యభరితమైన డిజైనింగ్ వర్క్ శారీస్ కలెక్షన్లను కూడా ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా ఈ ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు జయసుధ చెప్పారు.
సింపుల్ అండ్ డీసెంట్ గా ఉండే సహజ నటి చీరల డిజైనింగ్ అంటే చాలా ఇష్టపడతారు. చీరల డిజైనంగ్ పై ఉన్న మక్కువతో గత కొంతకాలంగా శారీ డిజైనర్ గా కూడా సత్తా చాటుకుంటున్నారు. ఖాళీ సమయాల్లో తనలోని సృజనాత్మకతకు మెరుగులు పెడుతున్నారు. జయసుధ కలెక్షన్స్ అంటే ఇష్ట పడే వారంతా ప్రతి ఏటా ఈ పదర్శనకు వచ్చిన వాటిని సొంతం చేసుకుంటుంటారు.


Click it and Unblock the Notifications











