చిరు సి.ఎం కాలేరు

By Staff

Jayasudha
చిరంజీవి రాజకీయాల్లో ఇప్పుడే అడుగు పెట్టారని ఈ సారికి ఆయన ముఖ్యమంత్రి కావడం చాలా కష్టమన్న అభిప్రాయాన్ని ప్రముఖ సినీ నటి జయసుధ అన్నారు. ఆమె సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీఅభ్యర్థి గా పోటీ చేస్తున్నారు. తాజాగా ఒక ప్రెవేట్ టి.వి.ఛానెల్ కార్యక్రమంలో ఆమె పాల్గొని ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. ఇప్పటికైతే కష్టమని బహుశా ఐదేళ్ల తరువాత ఆయన స్ధాపించిన ప్రజారాజ్యం పార్టీ అధికారంలోకి రావచ్చునేమో అని ఆమె అన్నారు.

ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైయస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేసారు. అంతేగాక మరో ఐదేళ్ళు మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్నలనను పోందితే మరో ఐదేళ్ళపాటు వై.ఎస్. ముఖ్యమంత్రిగా అధికారం లోకి వస్తే ఆ టర్మ్ ముగిసేదాకా చిరంజీవి ఆగక తప్పదన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. చిరంజీవి సినిమా పరిశ్రమలో స్వయం కృషితో ఎదిగి మెగాస్టార్ స్థాయికి చేరారు. ఆయన మెగాస్టార్ అని అంగీకరిస్తాను అయితే రాజకీయాల్లో ఆయనకు ఇంకా అనుభవం కావాలి పేర్కొన్నారు. చిరంజీవి, జయసుధ కొన్ని సినిమాల్లో కలిపి నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X