సినిమా ఇండ్రస్టీ కష్టకాలంలో...జయసుధ
ప్రస్తుతం సినిమా ఇండ్రస్టీ కష్టకాలంలో ఉందనీ...ఈ సమయంలో 'మా' తీసుకున్న నిర్ణయంపై ఎవరెలా స్పందిస్తారో అన్నదానిపై వేచి చూడాలనీ సికింద్రాబాద్ ఎమ్మెల్యే, సినీనటి జయసుధ అన్నాపు, అవాహే సానుకూలంగా స్పందించాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అన్నారు. అగ్రహీరోలు, డైరెక్టర్ల పారితోషికం విషయంలో 'మా' తీసుకున్న నిర్ణయంపై సానుకూలంగా స్పందిస్తే సినిమా పరిశ్రమకు మంచిరోజులు ఉంటాయని ఆమె అభిప్రాయపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలోని లేస్ పార్కును ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇలా వ్యాఖ్యానించారు. అలాగే ప్రస్తుత రాజకీయాలపై వ్యాఖ్యానించేందుకు ఆమె నిరాకరించారు.
జయసుధ సినిమా ఇండస్ట్రీ సికింద్రాబాద్ కాంగ్రెసు నరసాపురం jayasudha west godavari film industry secunderabad congress


Click it and Unblock the Notifications