రామ్ చరణ్ మూవీ: జయసుధకు భారీ రెమ్యూనరేషన్?
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో జయసుధ, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో జయసుధకు సాధారణం ఇచ్చే రెమ్యూనరేషన్ కంటే ఎక్కువ మొత్తం ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.
ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఆమె రెమ్యూనరేషన్ రూ. 35 లక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. జయసుధ డేట్స్, ఆమె పాత్ర నిడివితో పోలిస్తే ఇది భారీ మొత్తం అని తెలుస్తోంది. చిరంజీవి సినిమాలో జోక్యం చేసుకుని ఆకస్మిక మార్పులు చేయడం వల్లనే ఆమె డేట్స్ కోసం ఇంత భారీ మొత్తం ఆఫర్ చేసినట్లు సమాచారం.

ఇటీవల ఈచిత్రం షూటింగ్ కొంత పూర్తయిన తర్వాత చిరంజీవి సూచన మేరకు నటుడు రాజ్ కిరణ్ స్థానంలో ప్రకాష్ రాజ్‌ను తీసుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే రాజ్ కిరణ్ పార్ట్ షూటింగ్ మొత్తం పూర్తయింది. అతనికి పేమెంట్ కూడా ఇచ్చారు. ఇపుడు అతన్ని తీసి ప్రకాష్ రాజ్‌ను తీసుకుని అందుకు సంబంధించిన సీన్లు మళ్లీ షూట్ చేయడం కారణంగా నిర్మాత బండ్ల గణేష్‌కు రూ. 5 కోట్ల నష్టం వచ్చినట్లు ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. ఆ మధ్య షూటింగుకు విరామం ఇవ్వడానికి కారణం కూడా ఇదేనట.
బడ్జెట్ ఎక్కువ అవుతోందని బండ్ల గణేష్ లోలోన మదన పడుతున్నప్పటికీ....బయటకు మాత్రం నవ్వుతూ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు. బండ్ల గణేష్ మాట్లాడుతూ...మెగా పవర్ స్టార్ రాంచరణ్, కాజల్ జంటగా మా బ్యానర్‌లో నిర్మిస్తున్న 'గోవిందుడు అందరివాడేలే' తదుపరి షెడ్యూల్ ని జూన్ నుండి చేస్తున్నాము. ఈ షెడ్యూల్‍లో ఫ్యామిలీ ఎపిసోడ్స్ షూటింగ్ చేయనున్నాము. ఈ షెడ్యూల్ అనంతరం యూనిట్ మొత్తం లండన్ షూటింగ్ కి వెళ్తారు. ఈ చిత్రంలో శ్రీకాంత్, కమిలినీ ముఖర్జీలు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రామ్ చరణ్, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్‌ల మధ్య ప్రతి సన్నివేశం ఆధ్యంతం నవ్విస్తూ ఆకట్టుకుంటాయి. చక్కటి కుటుంబ కథా చిత్రాలు తెరకెక్కించడంలో దిట్ట కృష్ణ వంశీ. 'గోవిందుడు అందరివాడేలే' చిత్రాన్ని తెలుగు సాంప్రదాయాలకు అద్దంపట్టేలా తీర్చిదిద్దుతున్నారు. ప్రతి విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు. రామ్ చరణ్, కాజల్, శ్రీకాంత్ ఇలా ప్రతి ఒక్కరి వేషాలంకరణలో కూడా తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు కృష్ణ వంశీ. మా లిటిల్ బాస్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ కి అమితమైన రెస్పాన్స్ రావడమే దీనికి నిదర్శనం. ఈ ఫస్ట్ లుక్ తరువాత ట్రేడ్‌లో బిజినెస్ క్రేజ్ అమాంతం పెరిగిపోవడం విశేషం. రామ్ చరణ్ కెరీర్ లో ది బెస్ట్ బిజినెస్ ఈ చిత్రం చేయబోతుందనడంలో సందేహం లేదు అని తెలిపారు.


Click it and Unblock the Notifications











