twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇలియానా,నయనతార కాంగ్రెస్ లో..

    By Staff
    |

    Jayasudha
    ఇలియానా లేక నయనతార కాంగ్రెస్ లో చేరి అవార్డు పొందినట్లయితే తాను అర్థం చేసుకోగలనని, కాని తాను సీనియర్ నటినని, కచ్చితంగా డాక్టరేట్ కు తాను అర్హురాలినేనని సహజనటి జయసుధ పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీలో తన పాత్రకు, తనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయాలన్న విశ్వవిద్యాలయం నిర్ణయానికి సంబంధం ఆమె ఏమీ లేదని స్పష్టం చేశారు.

    సహజ నటిగా పేరొందిన జయసుధకు అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. కాని, ఆమె ఈ డాక్టరేట్ కు అనర్హురాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళన కూడా నిర్వహించాయి. దీనితో ఆమెకు గౌరవ డాక్టరేట్ పట్టా ప్రదానం వివాదాస్పదంగా మారింది. అయితే, ప్రతిభ గల కళాకారిణిగా తాను డాక్టరేట్ కు అర్హురాలినేనని జయసుధ స్పష్టం చేసింది. ఎఒయు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడినప్పుడు ఆమె ఈ స్పష్టీకరణ చేశారు.

    డాక్టరేట్ కు అర్హత పొందేంతగా జయసుధ సేవలేమీ చేయలేదన్న విమర్శలను ఆమె ప్రస్తావిస్తూ 'వాస్తవానికి ఇప్పటికే చాలా ఆలస్యమైందని చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరూ అంటున్నారు. నేను 13 ఏళ్ళ వయస్సు నుంచి నటిస్తున్నాను.మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతిబింబించే పాత్రలను పోషించిన ఏకైక నటిని నేనే. చాలా సంవత్సరాలుగా చారిటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని, అంతే కాకుండా టెలివిజన్ షోల ద్వారా కూడా తాను పేదలకు చేయూత ఇచ్చానని ఆమె తెలియజేశారు.

    అలాగే 'ఈ విద్యార్థి యూనియన్లకు నా గురించి మాట్లాడే హక్కు లేదు. ఇది మరొక పబ్లిసిటీ స్టంట్ మాత్రమే. వారు దీనికి బదులు విద్యార్థి సంక్షేమ కార్యక్రమాలపై ఎందుకు దృష్టి కేంద్రీకరించరు? ఈ విమర్శ చంద్రబాబు నాయుడు లేదా చిరంజీవి వంటి అగ్ర శ్రేణి నాయకుల నుంచి వచ్చి ఉంటే అర్థం ఉండేది' అని పేర్కొన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X