»   » ఆయనకు కావాల్సింది అదే.... భర్త మరణంపై జయసుధ స్పందన!

ఆయనకు కావాల్సింది అదే.... భర్త మరణంపై జయసుధ స్పందన!

Posted By:
Subscribe to Filmibeat Telugu

  హైదరాబాద్: ప్రముఖ తెలుగు నటి జయసుధ భర్త, నిర్మాత నితిన్ కపూర్ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. నితిన్ కపూర్ మరణంపై రకరకాల ప్రచారాలు జరిగాయి. ఆత్మహత్య అని కొందరు, అనుమానాస్పదం అని మరికొందరు రకరకాలుగా చర్చించుకున్నారు.

  భర్త మరణంతో విషాదంలో మునిగిపోయిన జయసుధ.... తాజాగా స్పందించారు. ఆమె ప్రత్యేకంగా ఈ రోజు స్పందించడానికి ఓ కారణం కూడా ఉంది. నేడు (మార్చి 17) జయసుధ-నితిన్ కపూర్ పెళ్లి రోజు. ఈ సందర్భంగా ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

  ఆయనకు కావాల్సింది దొరికింది

  ఆయనకు కావాల్సింది దొరికింది

  ప్రియమైన భర్త, నా కాన్ఫిడెంట్, నా తోడు... నితిన్ కపూర్ ప్రస్తుతం దేవతలతో ఉన్నారు. చాలా కాలంగా ఆయన శాంతి కోసం వెతుకుతున్నారు. ఎట్టకేలకు ఆయనకు కావాల్సింది దొరికింది అంటూ జయసుధ వ్యాఖ్యానించారు.

  అది చాలా తీవ్రమైన పరిస్థితి

  అది చాలా తీవ్రమైన పరిస్థితి

  డిప్రెషన్ అనేది చాలా తీవ్రమైన మెడికల్ కండీషన్. నా జీవితంలో జరిగిన చీకటి సంఘటనను సెన్సేషన్ చేయకుండా సంయమనం పాటించినందుకు మీడియా వారికి ధన్యవాదలు. నా ఫ్యామిలీ ప్రైవసీ నాకు ముఖ్యం అని జయసుధ చెప్పుకొచ్చారు.

  32 ఏళ్ల క్రితం

  32 ఏళ్ల క్రితం

  ఈ రోజు మా పెళ్లి రోజు. సరిగ్గా 32 సంవత్సరాల క్రితం మా వివాహం జరిగింది. ఆయనతో గడిపిన మధుర క్షణాలు నాకు గుర్తుకొస్తున్నాయి. ప్రస్తుతం ఆయన ఎక్కడున్నా మమ్మల్ని కాపాడుతూనే ఉంటారని నాకు తెలుసు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నా అని జయసుధ అన్నారు.

  ధన్యవాదాలు

  ధన్యవాదాలు

  ఈ విషాద సమయంలో నాకు, నా కుటంబానికి మద్దతు ప్రకటించిన ప్రతీ ఒక్కరికీ నా ధన్యవాదాలు. మీ ప్రేమ, అభిమానాలు మా కుటుంబంపై ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అంటూ జయసుధ సోషల్ మీడియా ద్వారా సందేశం పంపారు.

  English summary
  "My beloved husband, confidante and companion, Nitin Kapoor, is with the angels now and is finally at peace - peace that he was trying to find for a long time. Depression is a real and very overpowering medical condition. I would appreciate the media not sensationalizing this dark event in my life and respect it for what it is. My family's privacy, in our time of grief, is of utmost importance to me right now.Today, 32 years ago, I married my husband. It is our wedding anniversary. On this day I reminisce in the beautiful times that we spent together. I know that wherever he is, he is looking down at us and protecting us with his love." Dr. Jayasudha Kapoor said.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more