శోభన్ బాబుతో పర్సనల్ విషయాలు కూడా!..కృష్ణకు ఆయనకు తేడా అదే: జయసుధ

Recommended Video

శ్రీదేవి, జయప్రద ది గ్లామర్ నాది నటన

సహజనటి జయసుధ తన సినీ అంతరంగంపై ఓ యూట్యూబ్ చానెల్‌లో మనసు విప్పి మాట్లాడారు. సినిమాల్లోకి వచ్చిన తొలినాళ్లలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు.. అలాగే కో-స్టార్స్‌తో అనుబంధం గురించి పంచుకున్నారు. మరీ ముఖ్యంగా ఒకప్పటి సోగ్గాడు శోభన్ బాబు, సూపర్ స్టార్ కృష్ణల గురించి ఆమె చెప్పిన పలు విశేషాలు చాలామందిని ఆకట్టుకుంటున్నాయి. జయసుధ చెప్పిన ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..

 ఆ విషయంలో ఇద్దరికీ చాలా తేడా..

ఆ విషయంలో ఇద్దరికీ చాలా తేడా..

ఇంటర్వ్యూలో భాగంగా శోభన్ బాబు గురించి ప్రస్తావించిన యాంకర్.. ఆయన అందం గురించి ప్రశ్నించారు. శోభన్ బాబు గారిని ఈ తరంలో చాలామంది చూడలేదు కదా.. తను నిజంగా అంత హ్యాండ్సమా?.. అని అడిగారు.

యాంకర్ ప్రశ్నకు నవ్వుతూ బదులిచ్చిన జయసుధ.. 'అవును ఆయన చాలా హ్యాండ్సమ్' అని చెప్పారు. అయితే అంతకన్నా కృష్ణ గారు కూడా హ్యాండ్సమ్‌గా ఉండేవారన్నారు. కానీ వీరిద్దరికీ ఓ విషయంలో మాత్రం చాలా తేడా ఉందన్నారు.

శోభన్ బాబుతో పర్సనల్ విషయాలు కూడా..:

శోభన్ బాబుతో పర్సనల్ విషయాలు కూడా..:

ఇద్దరూ అందగాళ్లే అయినప్పటికీ.. కృష్ణ చాలా తక్కువగా మాట్లాడేవారని జయసుధ చెప్పారు. అవసరమైతే తప్ప పెద్దగా మాట్లాడే మనస్తత్వం కాదని అన్నారు. కృష్ణ అంటే, తనకూ ఒకరకమైన భయం ఉండేదని, బహుశా.. తన అంకుల్ కావడం వల్లనేమో! అని చెప్పుకొచ్చారు. అయితే శోభన్ బాబు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉండేవారని చెప్పారు. చాలామంది హీరోయిన్లు ఆయనతో వ్యక్తిగత విషయాలు కూడా పంచుకునేవారని గుర్తుచేసుకున్నారు. అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో ఆయనకు బాగా తెలుసని చెప్పారు.

 ఓరోజు నాతో ఇలా అన్నారు..

ఓరోజు నాతో ఇలా అన్నారు..

ఇంట్లో జరిగే గొడవల దగ్గరి నుంచి బాయ్ ఫ్రెండ్‌తో తలెత్తే ఇబ్బందుల దాకా ప్రతీది శోభన్ బాబుతో షేర్ చేసుకునేవారని జయసుధ గుర్తుచేసుకున్నారు. ఒకరోజు సెట్‌లో శోభన్ బాబు తన వద్దకు వచ్చి.. 'అదేంటే.. అంతా నా దగ్గరికొచ్చి బాయ్ ఫ్రెండ్స్ గురించి చెబుతున్నారు. నేను కదా మీ హీరోను.. మీరలా చెబితే నేను ఫీలవనా' అంటూ సరదాగా నవ్వేశారట. ఆ విషయాన్ని గుర్తుచేసుకుని జయసుధ కూడా గట్టిగా నవ్వేశారు.

అలాంటి సీన్స్ ఇబ్బంది అనిపించలేదా?

అలాంటి సీన్స్ ఇబ్బంది అనిపించలేదా?

14-15ఏళ్ల వయసున్నప్పుడే జయసుధ ఎన్టీఆర్ లాంటి సీనియర్ హీరోలతో కలిసి ఆడిపాడారు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన యాంకర్.. వయసులో అంత తేడా ఉన్నా.. కలిసి నటించడం ఎప్పుడూ ఇబ్బంది అనిపించలేదా?.. మరీ ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ చేయాల్సి వచ్చినప్పుడు ఎలా అనిపించేదని అడిగారు.

మొదట్లో తనకు ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్ పలికించాలనేది సరిగ్గా తెలిసేది కాదని జయసుధ అన్నారు. ఒకానొక సందర్భంలో ఓ డైలాగ్ చెప్పడానికి తాను చాలా ఇబ్బందిపడ్డానని గుర్తుచేసుకున్నారు.

 ఆ డైలాగ్'కి ఇబ్బందిపడ్డా..:

ఆ డైలాగ్'కి ఇబ్బందిపడ్డా..:

'ఎందుకో తెలుసా.. రాత్రంతా నువ్వే నాకు కలలో వచ్చావు' అన్న డైలాగ్ చెప్పడానికి తాను చాలా ఇబ్బందిపడ్డట్టు జయసుధ తెలిపారు. అంత చిన్న వయసులో అలాంటి డైలాగ్స్ కు హావభావాలు పలికించేంత పరిణితి ఉండకపోయేదని, అలాంటి సందర్భాల్లో డైరెక్టర్లు పక్కకు తీసుకెళ్లి దాని గురించి వివరించేవారని చెప్పుకొచ్చారు.

ప్రకాష్ రాజ్‌తో:

ప్రకాష్ రాజ్‌తో:

ప్రకాష్ రాజ్ తో కలిసి పేరెంట్స్ క్యారెక్టర్స్ కు హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్నారు జయసుధ. ఇదే విషయాన్ని గుర్తుచేస్తూ.. ప్రకాష్ రాజ్ తో అనుబంధం గురించి అడిగారు. దీనికి నవ్వుతూ బదులిచ్చిన జయసుధ.. 'హాయ్ ప్రకాష్.. బై ప్రకాష్.. అని చెప్పడం తప్ప ఆయన నేనూ ఎప్పుడూ పెద్దగా మాట్లాడుకోలేదు' అని చెప్పారు.

నన్నూ 'సూపర్ స్టార్' అని ప్రూవ్ చేశారు..:

నన్నూ 'సూపర్ స్టార్' అని ప్రూవ్ చేశారు..:

గ్లామర్ మాత్రమే కాదు.. హీరోయిన్లకు నటన అన్నది ముఖ్యమని ప్రేక్షకులు తన విషయంలో ప్రూవ్ చేశారని జయసుధ అన్నారు. విజయశాంతి రాకముందు తానూ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నానని పేర్కొన్నారు. శ్రీదేవి, జయప్రద లాంటి స్టార్ హీరోయిన్లు ఉన్న సమయంలోనే.. సితార మేగజైన్‌లో వరుసగా మూడుసార్లు తానే అగ్ర హీరోయిన్‌గా ఎంపికయ్యానని గుర్తుచేసుకున్నారు. తద్వారా ప్రేక్షకులు నటనకు పట్టం కడుతారని ప్రూవ్ చేశారని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X