»   »  జయసుధ కొడుకు ఓటు దేనికి ?

జయసుధ కొడుకు ఓటు దేనికి ?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Jayasudha
సినిమాల ప్రభావం నిజ జీవితంపై ఉంటుందా...ఏమో చెప్పలేమంటారు. అయితే జయసుధ ఈ మధ్య చేసిన రెండు సినిమాల (బొమ్మరిల్లు,కొత్త బంగారు లోకం) ప్రభావం ఆమె కుమారుడు నిహార్ పై ఉంటుందా ఉండదా అని ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చలు జరుపుతున్నారు.

సహజ నటి జయసుధ తన కుమారుడు నిహార్(22)ని ఆ మధ్య హీరో చేద్దామని నిర్ణయించుకుని ప్రయత్నాలు చేసింది. లగడపాటి శ్రీదర్ నిర్మాతగా వీరుపోట్ల దర్శకుడుగా ఆ ప్రయత్నాలు జరిగాయి. అయితే అనుకోని కొన్ని కారణాల వల్ల ఆ ప్రయత్నాలు ఎందుకనో ఊపందుకోలేదు. ఫలితమూ కనపడలేదు. దాంతో ఆమె తన కుమారుడుని ఇప్పుడు డైరక్టర్ కమ్మని ఆశ్వరదించింది. ముందుగా ఎక్కడన్నా అసెస్టెంట్ గా జాయిన్ అయి దర్శకత్వ మెళకవులు సంపాదించి తర్వాత డైరక్షన్ చేసైమంది.

అయితే అతను మాత్రం సముఖంగా లేడని తెలుస్తోంది. హీరోగా అయితే హ్యాపీగా లైఫ్ లీడ్ చేయచ్చు...ముఖ్యంగా తెలుగు ఫీల్డులో అయితే బుర్ర ఉపయోగించకుండా బాడీ చూపెడుతూ బ్రతికేయవచ్చని ఆశిస్తున్నాడుట. అదే అతని స్నేహితులవద్ద చెపుతున్నాడని తెలుస్తోంది. అయితే అతను తెలివైన వాడని,అంతకు మించి క్రియేటివ్ థాట్స్ ఉన్నవాడని అందుకే ఆమె ఆ నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు. అందులోనూ ఈ ఫీల్డ్ లో హీరోల పిల్లలు హీరోలు అవుతేనే ఎంకరేజ్ చేస్తారు. అదే హీరోయిన్ పిల్లలు అయితే హీరోయిన్స్ కావాలి.

ఐటం డాన్సర్స్ పిల్లలు వాళ్ళే కావాలి అభినయశ్రీలాగ. అలా మనవాళ్ళు మైండ్స్ ఫిక్స్ అయి పోయారు. దీన్ని తప్పించటం ఎప్పుడోగానీ జరగదు.అదే డైరక్టర్ అయితే చక్కగా కాస్త నేర్చుకుని మొదటిసినిమా హిట్టిస్తే తర్వాత చాలా కాలం ఆ పేరు చెప్పుకుని బ్రతికేయవచ్చు. అందులోనూ జయసుధకి పరిశ్రమలో ఉన్న పరిచయాలతో హీరోలకు కథ చెప్పటానికి,డైరక్షన్ ఛాన్స్ ఇప్పించటానికి అడగటానికి స్కోప్ ఉంటుంది.

తల్లిగా ఇవన్నీ ఆలోచించే ఆమె ఈ నిర్ణయానికి వచ్చిందని అంటున్నారు. మరి నిహార్ బొమ్మరిల్లు సినిమాలలో సిద్దార్ధ లాగ తల్లి తండ్రులు తమ ఆలోచనలు నిర్ణయించకూడదని తన మనసులో ఉన్న ఆలోచనలతో ముందుకెళతాడో... లేక కొత్త బంగారు లోకంలో వరుణ్ సందేష్ లాగ తల్లి మాటకు విలువనిస్తాడో వేచి చూడాలి. ఆ రెండు పాత్రలలో దేనికి ఓటు వేస్తాడో వేచి చూడాలంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X