మరోసారి తెరమీదకి సహజనటి: ఆ విషాదం తర్వాత మళ్ళీ సినిమాలోకి జయసుధ

సీనియర్‌ నటుల నుంచి యంగ్‌ హీరోల వరకు అందరూ మణిరత్నం సినిమాలో చాన్స్‌ కోసం ఎదురుచూస్తుంటారు. అలాంటి ఓ అరుదైన అవకాశం మరోసారి టాలీవుడ్‌ సీనియర్‌ నటి జయసుధ తలుపు తట్టింది.

Recommended Video

మరోసారి తేరమీదకి సహజనటి

జయసుధ భర్త నితిన్ కపూర్ ఆరు నెలల క్రితం మరణించారు. అప్పటి నుంచి కోలుకోలేని విషాదంలో ఉన్న ఆమె కొత్త చిత్రాలేవీ అంగీకరించలేదు, మీడియాకీ, జనానికీ దూరంగా ఉన్నారు. మొన్న జరిగిన గౌతమీ "విన్నర్స్ వాక్" ఈవెంట్ లో కనిపించారు జయసుధ, ఆ విషాదం నుంచి కోలుకోవటానికి చాలానే స్ట్రగుల్ పడ్డ ఈ సహజనటి. మళ్ళీ పాత జయసుధగా కనిపించటానికి ప్రయత్నిస్తున్నారు.

 మణిరత్నం సినిమా

మణిరత్నం సినిమా

చాలా గ్యాప్ తర్వాత ఆమె మొదటగా మణిరత్నం సినిమాలో నటించడానికే అంగీకరించారు. దక్షిణాది నటీనటులకు మణిరత్నం సినిమాలో నటించటం ఓ కల. అందుకే హిట్‌ ఫ్లాప్‌ లతో సంబంధం లేకుండా మణిరత్నం సినిమా అంటే చాలు ఎవరైన ఓకె చెప్పేస్తారు.

 నటి జయసుధ

నటి జయసుధ

సీనియర్‌ నటుల నుంచి యంగ్‌ హీరోల వరకు అందరూ మణిరత్నం సినిమాలో చాన్స్‌ కోసం ఎదురుచూస్తుంటారు. అలాంటి ఓ అరుదైన అవకాశం మరోసారి టాలీవుడ్‌ సీనియర్‌ నటి జయసుధ తలుపు తట్టింది. భర్త మరణం తరువాత నటనకు దూరంగా ఉంటున్న ఈ సీనియర్‌ నటి చాలా కాలం తరువాత ఓ తమిళ సినిమాకు అంగీకరించింది.

వరస ఫ్లాపులతో

వరస ఫ్లాపులతో

మణిరత్నం సినిమా కావటం వల్లనే జయసుధ ఆ సినిమాలో నటించేందుకు అంగీకరించిందట.ఈ మధ్య కాలంలో వరస ఫ్లాపులతో సతమతమవుతున్న మణిరత్నం ఈసారి పాత - కొత్త నటుల కలయికతో ఓ సినిమా ప్లాన్ చేశాడు. తమిళ్ స్టార్ హీరో శింబు హీరోగా తీయబోయే సినిమాలో ఓ ప్రధాన పాత్రకు తెలుగు నటి జయసుధను తీసుకుంటున్నారు.

మణిరత్నం స్వయంగా కోరడంతో

మణిరత్నం స్వయంగా కోరడంతో

"సినిమాలో ఇంపార్టెంట్ రోల్ కావడంతో మణిరత్నం స్వయంగా వచ్చి కోరడంతో జయసుధ నటించేందుకు ఒప్పుకున్నారని" యూనిట్ సభ్యుడొకరు చెప్పారు. జయసుధ తెలుగుతో తమిళంలోనూ పలు సినిమాలు చేశారు. మణిరత్నం ఇంతకుముందు డైరెక్ట్ చేసిన సఖి సినిమాలో హీరోయిన్ షాలిని తల్లిగా నటించారు.

మరో సారి కోలీవుడ్ లో

మరో సారి కోలీవుడ్ లో

తాజాగా నాగార్జున - కార్తి కాంబినేషన్ లో వచ్చిన ఊపిరి మూవీతోనూ తమిళ ప్రేక్షకులను పలకరించారు. తిరిగి మణిరత్నం సినిమాతో మరో సారి కోలీవుడ్ లో కనిపించనున్నారు. ఈ మూవీలో హీరోయిన్ గా జ్యోతిక నటిస్తుండగా.. విజయ్ సేతుపతి - అరవింద్ స్వామి ఇతర ముఖ్య పాత్రలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X