కొడుకును రంగంలోకి దింపుతున్న జయసుధ

By Bojja Kumar

సహజ నటిగా తెలుగు సినిమా తెరను ఏలిన అలనాటి హీరోయిన్లలో జయసుధ ఒకరు. ప్రస్తుతం సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలో అడుగు పెట్టిన ఈ సీనియర్ తార ప్రస్తుతం రాజకీయాల్లో రాణిస్తోంది. కాంగ్రెస్ పార్టీ తరుపున సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. జయసుధ రాజకీయాల సంగతి పక్కన పెడితే.....జయసుధ వారసులెవరూ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టలేదు. జయసుధకు నిహార్ అనే కుమారుడు ఉన్నా... ఇప్పటి వరకు ఇండస్ట్రీ ముఖం ఎరుగడు. అతను హీరోగా అన్ ఫిట్ అనేది చాలా మంది అంటుంటారు. కారణం తాడిచెట్టంట పొడవు(6"7"") ఉండటమే ఇందుకు కారణం. దీంతో జయసుధ కూడా అతన్ని పరిశ్రమలోకి తీసుకురావడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు.

అయితే..తాజాగా జయసుధ మనసులో కొత్త ఆలోచన మెదిలింది. రామానాయుడు మనవడు రానా ఓవర్ హైట్ ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో రాణిస్తుండటంతో...తనకొడుకును కూడా అదే విధంగా హీరోగా పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుందట. ప్రస్తుతం ఇండస్ట్రీలో తనకున్న పరిచయాలతో నిహార్‌ను హీరోగా సీనిమాల్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తందని ఫిల్మ్ నగర్ టాక్. దీనిపై త్వరలోనే అధికారిక సమాచారం వెలువడనుందని తెలుస్తూంది. అదే జరిగితే హీరోయిన్ వారసుడిగా పరిశ్రమలోకి వచ్చిన హీరోగా నిహార్ రికార్డులకెక్కనున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X