ఫస్ట్‌లుక్ చూసిన తర్వాత నేను కూడా అనుమానపడ్డాను: జయసుధ
మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి సంబంధించిన ప్రీ రీలీజ్ ఈవెంట్ కనివీని ఎరుగని రీతిలో నిర్వహించారు. సినీ రంగానికి చెందిన ప్రముఖులంతా ఈ వేడుకకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ... ''ఈ వేడుక చూస్తుంటే ఇక్కడ ఎన్టీ రామారావుగారు ఉన్నట్లే అనిపిస్తోంది. నేను చాలా అదృష్టవంతురాలిని. ఆయనతో దాదాపు 20కంటే ఎక్కువ చిత్రాలు చేశాను. ఎన్టీఆర్ మహానాయుడు, కథానాయకుడు బయోపిక్ తీస్తున్నారనే విషయం తెలియగానే ఎలా ఉంటుందో అనుకున్నాను. బాలకృష్ణ గారిని ఇండస్ట్రీలో ప్రేమతో, అభిమానంతో బాల అని పిలుస్తాము... ఆయన ఇందులో రామారావుగారి క్యారెక్టర్ చేయబోతున్నారు అనగానే ఫస్ట్ లుక్ చూడగానే నాకే అనుమానం వచ్చింది. నిజంగా రామారావుగారిని చూసినట్లే ఉంది. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది''అన్నారు.
ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో, ట్రైలర్ లాంఛ్ వేడుకలు శుక్రవారం (డిసెంబర్ 21) గ్రాండ్‌గా ఫిల్మ్ నగర్ లోని JRC కన్వెన్షన్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు ఎన్టీఆర్ కుటుంబంతో పాటు సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణతో పాటు సినీ రంగానికి చెందిన ప్రముఖులందరూ హాజరయ్యారు.

నందమూరి బాలకృష్ణ, విద్యాబాలన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి సాయి మాధవ్ బుర్రా మాటలు అందించారు.


Click it and Unblock the Notifications











