హీరోయిన్ల డ్రెస్సింగ్ వివాదం: ఎస్పీ బాలుకు మద్దతుగా జయసుధ, నాగబాబుకు కౌంటరా?

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇటీవల ఓ కార్యక్రమంలో... హీరోయిన్ల డ్రెస్సింగ్ గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. పబ్లిక్ ఫంక్షన్లలో నటీమణులు ఎక్స్ ఫోజింగ్ చేసే విధంగా దుస్తులు ధరించి రావడాన్ని ఆయన తప్పుబట్టారు.

ఎస్పీ బాలు చేసిన ఈ వ్యాఖ్యలపై నాగబాబు వెంటనే కౌంటర్ ఇచ్చారు. ఆయన పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా సెటైర్లు వేశారు. అమ్మాయిలు ఏ డ్రెస్ వేసుకోవాలో చెప్పే రైట్ మీకు లేదు, అయినా మీ దృష్టి అమ్మాయిల బొడ్డు, తొడల వైపు ఎందుకు వెళుతోంది? మార్పు రావాల్సింది మగాడి వక్రబుద్దిలో... పాత బూజుపట్టిన సాంప్రదాయాల నుండి ఇకనైనా బయటపడండి అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

జయసుధ ఏమన్నారంటే..

జయసుధ ఏమన్నారంటే..

హీరోయిన్ల డ్రెసింగ్ వివాదంపై తాజాగా జయసుధ స్పందించారు. ‘‘నేను కూడా చాలా సినిమాల్లో నటించాను. షార్ట్స్, మినీ స్కర్ట్స్ వేశాను. జ్యోతి లక్ష్మి కూడా ఎన్నో సినిమాల్లో పొట్టి దుస్తులు వేసి స్పెషల్ డాన్స్ నంబర్స్ చేసింది. అయితే అది సినిమాల వరకు మాత్రమే పరిమితం. సినిమా ఫంక్షన్లకు హాజరయ్యేపుడు సాంప్రదాయ బద్దంగా, ట్రెడిషనల్‌గా వచ్చేవారం.' అని తెలిపారు.

ఇప్పుడంతా షో బిజినెస్ అయిపోయింది

ఇప్పుడంతా షో బిజినెస్ అయిపోయింది

ప్రస్తుతం నటీమణుల తీరు పూర్తిగా మారిపోయింది. వారు డిజైనర్ వేర్ పేరుతో పబ్లిక్ ప్రదేశాలు, ఫంక్షన్లలో కూడా అలాంటి డ్రెస్సులే వేస్తున్నారు. అవి తప్ప మామూలు డ్రెస్సులు వేయడం లేదు. చివరకు ఎయిర్ పోర్టులకు కూడా అలానే వస్తున్నారు. పూర్తిగా షో బిజినెస్‌గా తయారైంది అని జయసుధ వ్యాఖ్యానించారు.

ఎస్పీ బాలుకు మద్దతుగా, నాగబాబుకు కౌంటరా?

ఎస్పీ బాలుకు మద్దతుగా, నాగబాబుకు కౌంటరా?

సందర్భాను సారంగా మన దుస్తులు ఉండాలని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెప్పే ప్రయత్నం చేశారంటూ జయసుధ కంక్లూజ్ చేయడం ద్వారా ఆమె తన మద్దతు ప్రకటించారు. అయితే జయసుధ వ్యాఖ్యలు నాగబాబుకు కౌంటర్‌లా ఉన్నాయనే అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.

నోరు విప్పని ప్రముఖులు

నోరు విప్పని ప్రముఖులు

అయితే హీరోయిన్ల డ్రెస్సింగ్ వివాదంపై ప్రముఖ స్టార్స్ మాత్రం నోరు విప్పలేదు. అయితే రష్మి, అనసూయ లాంటి వారు నాగబాబుకు సపోర్టుగా నిలిచారు. తమకు మద్దతుగా మాట్లాడినందుకు థాంక్స్ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X