భర్త మరణం తర్వాత ఇన్నాళ్ళకి: జనంలోకి జయసుధ, ఇన్నాళ్ళూ ఏమైపోయారు?
భర్త హఠాత్తుగా చనిపోవడంతో ఒక్కసారిగా షాక్‌కి గురైన జయసుధ నటించడం కూడా మానేశారు. అయితే చాలా కాలం తర్వాత ఆమె హైదరాబాద్‌లో జరగనున్న ఓ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారని తెలుస్తుంది.
సినీనటి జయసుధ భర్త నితిన్ కపూర్ ముంబైలోని ఓ అపార్ట్‌మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. వాకింగ్‌కు వెళ్లొస్తానని ఇంట్లో చెప్పి వెళ్లిన నితిన్ కపూర్ కొద్దిసేపటికే అపార్ట్‌మెంట్ కింద శవమై కనిపించారు... ఒకరకంగా ఇది ఆమె జీవితానికి ఊహించని దెబ్బ.

జయసుధ ఎక్కడున్నారు?
ఇక అక్కడి నుంచీ..సహజనటి జయసుధ ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అనే విషయాలు ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులు మినహా ఎవ్వరూ చెప్పలేరు. తన భర్త మరణం తర్వాత జయసుధ మీడియాని ఒక్కటే కోరారు. దయచేసి గుచ్చి గుచ్చి అడగవద్దని. మీడియా కూడా జయసుధను ఇబ్బంది పెట్టలేదు.
Recommended Video


భర్త హఠాత్తుగా చనిపోవడంతో
అసలే భర్త హఠాత్తుగా చనిపోవడంతో ఒక్కసారిగా షాక్‌కి గురైన జయసుధ, ఎవరు ఏం అడిగినా చెప్పలేకపోయారు. అప్పటి నుండి జయసుధ నటించడం కూడా మానేశారు. అయితే చాలా కాలం తర్వాత ఆమె హైదరాబాద్‌లో జరగనున్న ఓ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారని తెలుస్తుంది.

క్యాన్సర్‌పై అవగాహన కోసం
నటి గౌతమి క్యాన్సర్‌పై అవగాహన కోసం నిర్వహిస్తున్న లైఫ్ ఎగైన్ విన్నర్స్ వాక్ ఈవెంట్‌లో జయసుధ కూడా పాల్గొనబోతున్నారు. నవంబర్ 12, ఆదివారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో జరుగనున్న ఈ వాక్‌లో ఆమె పాల్గొనబోతున్నట్లుగా పోస్టర్‌లు బయటికి వచ్చాయి. ఉదయం 6గంటల 30నిమిషాలకు ఈ వాక్ మొదలవ్వనుంది.

విన్నర్స్ వాక్‌లో ఎలా దర్శనమిస్తారు?
అయితే ఈ మధ్య కాలంలో కెమెరాని ఫేస్ చేయని జయసుధ ఈ విన్నర్స్ వాక్‌లో ఎలా దర్శనమిస్తారు? మీడియాకి ఏమైనా తన పర్సనల్ విషయాలను తెలియజేస్తారా? మళ్లీ నటించే విషయంపై ఆమె ఏమైనా స్పందిస్తారా? అనే విషయాలు తెలియాలంటే మాత్రం ఆదివారం వరకు వెయిట్ చేయక తప్పదు.


Click it and Unblock the Notifications











