twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నందమూరి వారసులుగా పుట్టడం మా అదృష్టంగా జూ ఎన్టీఆర్

    By Sindhu
    |

    'లక్ష్మీ కల్యాణం', 'హరే రామ్' చిత్రాల ద్వారా సినినిమా ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన 'నందమూరి కళ్యాణ్ రామ్', హన్సిక నటించిన "జయీభవ" చిత్ర ఆడియో ఆవిష్కరణ గురువారం రాత్రి హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడా సినీ విలేజ్‌లో ఘనంగా జరిగింది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన కేసెట్‌ను మోహన్‌ బాబు విడుదలచేసి హరికృష్ణకు అందించారు. తరువాత సీడీని బాలకృష్ణ విడుదలచేసి జూనియర్ ఎన్టీఆర్‌కు అందజేశారు. 'జయీభవ" ఆడియో విడుదల కార్యక్రమంలో పాల్గొన్న పలువు అతిథుల మాట్లాడారు..

    ఈ కార్యక్రమంలో మోహన్ బాబు మట్లాడుతూ చదువుకునే రోజుల్లో థియేటర్లో ఎన్టీఆర్ సినిమా చూసి ఆయన అభిమానినయ్యాను. నేను గాలిమాటలు మాట్లాడను. నేను ఎన్టీఆర్ అభిమానిని. ఆయన్ను నేను అన్నయ్య అని పిలిచేవాన్ని. నందమూరి కుటుంబంతో నాకు ఎంతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఏ ఫంక్షన్ జరిగినా నన్ను కళ్యాణ్ రామ్ ఆహ్వానిస్తాడు అతడు చాలా మంచి వ్యక్తి. కళ్యాణ్ రామ్ కి మంచి భార్య దొరకడం అదృష్టం. కళ్యాణ్ మొదటిసినిమా నుంచి ప్రతి సినిమాకు నన్ను ఆహ్వానించాడు. ఒకే వర్గానికి చెందినవాడుగా కళ్యాణ్ రామ్ లేకుండా అందరికి పనికివచ్చే పువ్వుగా కళ్యాణ్ ఉన్నాడని మోహన్ బాబు పొగడ్తలతో ముంచెత్తాడు.

    తరువాత క్రమంలో కమేడియన్, హీరో అలీ మాట్లాడుతూ బాలయ్య తొడకొడితే ఎదుటివాడికి ఎరుపెక్కుద్ది అంటూ కామెడి గారడి చేస్తూ డైలాగ్ చెప్పినా, డాన్స్ చేసినా, తొడకొట్టినా ఒక నందమూరి వంశమే చేయాలి. ఆ వంశంలో నుండి వచ్చిన కళ్యాణ్ రామ్ భవిష్యత్తులో అందరిచేత 'జయీభవ" అని జై కొట్టించుకొటాండు అన్నారు.

    జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ కళ్యాణ్ రామ్, నేను తాతయ్య వారసులు కావడం మా అదృష్టం అని తెలిపారు. గొప్ప తండ్రి కడుపులో మేము పుట్టడం అదృష్టంగా భావిస్తున్నాం. కానీ మేమంతా తాతయ్య వారసులుగా పుట్టడం మరింత అదృష్టమని ఎన్టీఆర్ పేర్కొన్నారు. బాలయ్య మట్లాడుతూ జయీభవ అనేది నాన్నగారు నటించిన 'దానవీర శూరకర్ణ" చిత్రం లోని దూర్యోధనుని పాత్ర నుండి వచ్చిన సాంగ్ జయీభవ విజయీభవ ఆ రేంజ్ లో సినిమా ఉంటుంది. ఇప్పటివరకూ నటించిన చిత్రాలకంటే జయీభవ సినిమా మంచి సక్సెస్ ను కళ్యాణ్ రామ్ పొందుతాడని బాలయ్య అన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X