కళ్యాణ్ రామ్, హన్సికల 'జయీభవ' ఏమైంది?
మొన్న శుక్రవారం రిలీజైన జయీభవ చిత్రం ప్రారంభ వసూళ్లు బాగానే ఉన్నా చాలా చోట్ల డల్ అయింది. నూతన దర్శకుడు నరేన్ కొండేపాటి చిత్రాన్ని శ్రీనువైట్ల రెడీ రేంజిలో తీర్చిదిద్దాలని ఆశించి కామిడీ పండించలేక పూర్తి స్ధాయిలో నిరాశపరిచాడని సినీ వర్గాల్లో వినపడుతోంది. ఇప్పటికే ఎన్నోసార్లు తెరకెక్కిన రోమియో-జూలియట్ కథనే మళ్ళీ తిరగతోడటం మరో మైనస్ అంటున్నారు. అయినా టెక్నికల్ గా ఈ చిత్రం సౌండ్ గానే ఉందని స్క్రిప్టు పరంగా దొర్లిన లోపాలే ముంచాయని విశ్లేషిస్తున్నారు. ఇక హాట్ స్టార్ హన్సిక కూడా ఏ మాత్రం ప్లస్ కాలేకపోయిందని, కళ్యాణ్ రామ్ అదే సేమ్ ఎక్సప్రెషన్స్ తో ఆకట్టుకోవాలని చూడటమే కలెక్షన్స్ డ్రాప్ అవటానికి మరో కారణం అంటున్నారు. ఇక అలీ, బ్రహ్మానందం నవ్వించే ప్రయత్నం చేసినా విషయం లేకపోవటంతో కలిసిరాలేదు. దాంతో ఈ చిత్రం యావరేజ్ రేంజిలో కూడా నిలబడటం కష్టమేనని తేలుస్తున్నారు.


Click it and Unblock the Notifications











