twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఐశ్వర్యరాయ్ అదరగొట్టింది: ‘జజ్బా’ అఫీషియల్ ట్రైలర్

    By Bojja Kumar
    |

    ముంబై: చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఐశ్వర్యరాయ్ త్వరలో ‘జజ్బా' సినిమా ద్వారా మళ్లీ రీ ఎంట్రీ ఇస్తోంది. ఆమె సంజయ్ గుప్తా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ అఫీషియల్ ట్రైలర్ రిలీజైంది. ఇందులో ఐశ్వర్యరాయ్, ఇర్ఫాన్ ఖాన్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయే విధంగా ఉంది. ఈ చిత్రంలో ఐష్ పవర్ ఫల్ పాత్రలో కనిపించబోతోంది.

    ఇందులో ఆమె సింగిల్ మదర్, క్రిమిల్ లాయర్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమా పెర్ఫార్మెన్స్ పరంగా ఐశ్వర్యరాయ్ కి మంచి పేరు తెచ్చి పెడుతుందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. ఇందులో ఆమె పలు యాక్షన్ సన్నివేశాల్లో కూడా నటించింది. విభిన్న కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

    Jazbaa Official Trailer

    ఐశ్వర్యరాయ్ తో పాటు ఇర్ఫాన్ ఖాన్, షబానా అజ్మి, అనుపమ్ ఖేర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎస్సెల్ విజన్ ప్రొడక్షన్స్ ప్రై.లి. వైట్ ఫాదర్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అక్టోబర్ 9 నాటికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా కోసం ఐశ్వర్యరాయ్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    English summary
    Watch Aishwarya Rai Bachchan and Irrfan Khan in a race against time in the official trailer of Jazbaa. Releasing on 9th October.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X