twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తిరుపతిలో రేట్లు పెంచితే తప్పు లేదా? భీమ్లా నాయక్‌ రేట్లపై అభ్యంతరమా? జనం తిరుగుబాటు తప్పదు జగన్‌కు హెచ్చరిక

    |

    ఏపీలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు మధ్య భీమ్లా నాయక్ సినిమా వివాదం జోరందుకొన్నది. పవన్ సినిమాపై ఆంక్షలు విధిస్తూ ఏపీ సర్కార్ తీసుకొన్న నిర్ణయంపై పలువురు రాజకీయ నేతలు స్పందిస్తున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. భీమ్లా నాయక్ సినిమాపై ఆంక్షలు విధించడంపై జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ..

    చిరంజీవి చేతులు జోడించిన వీడియోను

    చిరంజీవి చేతులు జోడించిన వీడియోను

    మెగాస్టార్ చిరంజీవి కష్టాన్ని నమ్ముకొని స్వయంకృషితో పైకి వచ్చాడు. వాళ్లకు భయం అనేది తెలియదు. ఆయన తండ్రి కానిస్టేబుల్. ఎవరి సహయ సహకారం లేకుండా పైకి వచ్చాడు. అలాంటి ఉన్నతమైన వ్యక్తి సినీ పరిశ్రమ కోసం దీనంగా చేతులు జోడించి మొక్కాడు. ఆయనకే లేని ఇగో.. మీకు ఎందుకు? వైఎస్ జగన్ ముందు చేతులు జోడించి చిరంజీవి తప్పు చేశాడు. మీరు అలాంటి పనిచేయడం సరికాదు. సారీ చిరంజీవి గారు. మీ గురించి ఇలా మాట్లాడితే క్షమించండి. చిరంజీవి చేతులు జోడించిన సీన్‌ను షూట్ చేసి సోషల్ మీడియాలో పదే పదే చూపించావు. మీకు ఇగో ఉంది.. మిగితా వారికి లేదనుకొంటున్నావా అని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

    సినీ పరిశ్రమను నాశనం చేయకండి

    సినీ పరిశ్రమను నాశనం చేయకండి


    వైఎస్ జగన్ నీకు ఒక్కడికే ఇగో ఉందా? వేరే వాళ్లకు లేదా అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించాడు. నిన్ను ఎదురిస్తే జైల్లో పెడుతావు? నీవు చెప్పింది వింటే.. బతుకుతారు.. లేకపోతే చంపుతావా? అసలు ఈ సినిమా కథ ఏంటో తెలుసా? ఓ పోలీసు అధికారికి, రాజకీయ నేతకు మధ్య జరిగిన సంఘర్షణ. ఏపీలో అలాంటి పోలీసులు ఉన్నారా? అంతా నీ వెంటే ఉన్నారు? మా లాంటి వాళ్లు ప్రశ్నిస్తే.. జైల్లో పెడుతావు. నాపై కక్ష సాధింపుకు దిగితే నా ఆదాయం పడిపోయింది కావొచ్చు. నన్నేమైనా చేయగలిగావా? ఎవరినీ ఏమీ చేయలేవు? మాకు ధైర్యం ఉంది.. మీలాగే మాకు దండిగా ఇగో ఉంది. నీ అస్తవ్యస్తమైన విధానాలు చూసి ఒకరోజు ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఇలాంటి పాలసీలు అమలు చేస్తే సినిమా వాళ్లు ఏపీలో షూటింగులు కూడా జరగవు. దయచేసి సినీ పరిశ్రమను నాశనం చేయకండి అని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.

    ఏపీలోని ఏ స్టూడెంట్ కూడా..

    ఏపీలోని ఏ స్టూడెంట్ కూడా..

    ఏపీలో యువతలో కూడా మీ మీద విరక్తి పెరుగుతున్నది. ఏపీలో బీటెక్ పూర్తి చేసిన స్టూడెంట్ ఒక్కడు కూడా ఏపీలో ఉండటం లేదు. బెంగళూరు లేదా హైదరాబాద్‌కు వెళ్లి బతుకుతున్నారు. మీ కక్ష సాధింపు చాలించుకోండి. ఏపీ నాశనం అవుతున్నది. మీరు యంగ్ అండ్ టాలెంటెడ్ లీడర్ అనుకొన్నాం. కానీ అందంతా భ్రమే అని తేలింది. దయచేసి మీ యాటిట్యూడ్ మార్చుకోండి. మీ వల్ల పవన్ కల్యాణ్‌కు ఏమీ కాదు. తెలంగాణ మంత్రితో కేటీఆర్‌ను పిలుచుకొన్నాడు. పనికానిచ్చేసుకొన్నారు అని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.

    ప్రభుత్వ అధికారులకు థియేటర్ల వద్ద డ్యూటీలా?

    ప్రభుత్వ అధికారులకు థియేటర్ల వద్ద డ్యూటీలా?

    ఇక ఏపీలో అధికారుల పరిస్థితులు చాలా దారుణంగా మారాయి. రెవెన్యూ, పోలీసులంతా భీమ్లా నాయక్ సినిమా థియేటర్ల వద్ద డ్యూటీ చేస్తున్నారు. మండల కార్యాలయాల్లోకి వెళ్లి ఎమ్మార్వో ఎక్కడ అంటే.. భీమ్లా నాయక్ థియేటర్ల వద్ద ఉన్నారు అంటూ సమాధానం వస్తున్నది. మీరు ఎంత ప్రయత్నిస్తారో.. అంతకు అంత పవన్ కల్యాణ్ ఎదుగుతుంటాడు. థియేటర్ల వద్ద పోలీసులు, రెవెన్యూ అధికారులను పెట్టడం ఎందుకు.. ఏపీలో భీమ్లా నాయక్‌ను నిషేధించండి అని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

    Recommended Video

    Bheemla Nayak Trailer Records భీమ్లా నాయక్ రికార్డుల బీభత్సం Pre Booking Status | Filmibeat Telugu
    టీటీడీలో టికెట్లు రేట్లు పెంచితే పేదలకు కష్టం కాదా?

    టీటీడీలో టికెట్లు రేట్లు పెంచితే పేదలకు కష్టం కాదా?

    టికెట్ల రేట్లు పెంచితే పేదలకు వినోదం కరువు అవుతుందని చెప్పడం సరికాదు. అలాగైతే తిరుపతిలో దేవుడి దర్శనానికి వచ్చే పేదలకు, మధ్య తరగతి వాళ్లకు అన్యాయం జరగడం లేదా? టీటీడీ చైర్మన్ రెండు వేలు కాదు.. 2500 టికెట్ పెట్టండి అంటూ రేట్లు పెంచుతున్నారే? వెంకటేశ్వరస్వామిని దర్శించుకొనే పేదలకు అన్యాయం చేయడం లేదా? టీటీడీలో టికెట్లు పెంచుతారు? కానీ సినిమా టికెట్ రేట్లు పెంచితే అభ్యంతరకరమా? అని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు.

    English summary
    Bheemla Nayak release contraversy is going in Andhra Pradesh. In this occassion, JC Prabhakar Reddy blasts YS Jaganmohan Reddy over Pawan Kalyan's Bheemla Nayak ticket rates issue.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X