బ్రహ్మానందం వల్ల చాలా నష్టపోయాను
బ్రహ్మానందం తన విశ్వరూపం చూపించాడు. ఈ సినిమా విషయంలో ఆయన వల్ల నేను చాలా నష్టపోయాను కూడా. ఆయన నటిస్తుంటే ఒక దర్శకుడిగా కట్ చెప్పలేకపోయాను. దానివల్ల ఎక్కువ నెగెటివ్ ఖర్చయింది. దీనినిబట్టి ఆయన ఎంత గొప్పగా చేశారో అర్థం చేసుకోండి అంటున్నారు జెడీ చక్రవర్తి.ప్రస్తుతం జెడి 'మనీ మనీ మోర్ మానీ'అనే తెలుగు సినిమా డైరక్ట్ చేసి విడుదలకు రెడీ చేసి సిద్దంగా ఉన్నాడు. ఇది 'మనీ'కి రెండో సీక్వెల్ అనీ, అయితే ఇది కొత్త కథనీ చెప్పున్నాడు.ఇదివరకటి సినిమాల్లో నటించిన బ్రహ్మానందం, బ్రహ్మాజీ ఈ సినిమాలోనూ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఈ నెల 26న విడుదల కానున్న ఈ సినిమా విశేషాలను ఆయన మీడియాకు తెలిపారు. ఆయన మాట్లాడుతూ మనీ , మనీ మనీ చిత్రాల్లా ఈ సినిమా ఉంటుందా? అని చాలామంది అడుగుతున్నారు.అలా ఉంటే ఈ సినిమా చూడాల్సిన అవసరం లేదు. చక్కగా వాటి సీడీ తెచ్చుకొని చూస్తే సరిపోతుంది. కేవలం స్క్రీన్‌ప్లే విషయంలోనే ఆ సినిమాలకు ఈ సినిమా సీక్వెల్. ఆ సినిమాల్లో నాలుగు పాత్రలను మాత్రమే ఈ సినిమాకోసం తీసుకున్నాను. మనీ మనీ ఎక్కడ ఎండ్ అయ్యిందో అక్కడ్నుంచి ఈ సినిమా మొదలవ్వదు. ఎక్కడో మొదలై... ఎండ్ అవుతుంది. ఇదొక హ్యూమరస్ స్టోరీ అని చెప్పారు.


Click it and Unblock the Notifications











