నంది అవార్డ్స్ స్టుపిడ్, హంబగ్.... పవన్ సినిమాలకు ఓట్లు పడవంటున్న జేడీ

నంది అవార్డ్స్ తనకు రాలేదని, అందుకే అవి స్టుపిడ్, హంబక్, నాన్ సెన్స్ అంటూ జేడీ చక్రవర్తి వ్యాఖ్యానించారు.

By Bojja Kumar

Recommended Video

పవన్ సినిమాలకు ఓట్లు పడవంటున్న జేడీ !

రామ్ గోపాల్ వర్మ వద్ద శిష్యరికం చేసి నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఎదిగిన జేడీ చక్రవర్తి..... తాజాగా ఓ టీవీ ఇంటర్వ్యూలో తన గురువును తలపించేలా మాట్లాడారు. యాంకర్ అడిగే ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు చెప్పారు.

ఇంతకాలం తెలుగులో కనిపించకుండా ఎక్కడికి వెళ్లారు? అనే ప్రశ్నకు జేడీ సమాధానం చెబుతూ తమిళం, మలయాలం, కన్నడలో నటుడిగా, దర్శకుడిగా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నట్లు తెలిపారు.

 బ్రేకప్ అవ్వడానికి మేమేమైనా లవర్సా?

బ్రేకప్ అవ్వడానికి మేమేమైనా లవర్సా?

రామ్ గోపాల్ వర్మకు, మీకు బ్రేకప్ అయిందట కదా? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు జేడీ స్పందిస్తూ.... మేమేమైనా లవర్సా? బ్రేకప్ అవ్వడానికి అంటూ సమాధానం ఇచ్చారు. ఇక గొడవ అనేది సాటి సమానుల మధ్య వస్తుంది. ఆయన నా గురువు. అలాంటపుడు గొడవ వచ్చే అవకాశమే లేదు... అని జేడీ వ్యాఖ్యానించారు.

 చిన్నచూపు అనేది అబద్దం

చిన్నచూపు అనేది అబద్దం

బాలీవుడ్లో సౌత్ ఆర్టిస్టుల పట్ల చిన్న చూపు ఉంది, అందుకే అక్కడ సౌత్ యాక్టర్స్ రానించడం లేదు అనే వాదనలో నిజం లేదని, అలా అనడం పూర్తిగా అబద్దం అని జేడీ చక్రవర్తి వ్యాఖ్యానించారు.

 నంది అవార్డ్స్ నాన్ సెన్స్

నంది అవార్డ్స్ నాన్ సెన్స్

1989 నుండి 2017 ఇచ్చిన నంది అవార్డులన్నీ స్టుపిడ్, హంబక్, నాన్ సెన్స్ అంటూ ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు జేడీ. నా ఉద్దేశ్యంలో అవన్నీ రాంగ్. ఎందుకంటే అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు ఒక్క నంది అవార్డు కూడా రాలేదు. నాకు వస్తే కరెక్ట్, రాక పోతే రాంగ్. ఎవరికొచ్చింది, ఎవరి రాలేదు అనేది నాకు అనవసరం. నేను చాలా సెల్ఫిష్, ఈ అవార్డుల వెనక రాజకీయం ఉందా? మరేదైనా ఉందా? అనేది నాకు తెలియదు. నాకు రానంత వరకు అవి తప్పుడు అవార్డులే అని జేడీ కామెంట్ చేశారు.

 అలా అని ఇన్సల్ట్ చేసినట్లా?

అలా అని ఇన్సల్ట్ చేసినట్లా?

నంది అవార్డ్ నాకు రాలేదు కనుక నాకు నచ్చలేదండీ. కత్రినా కైఫ్ ను నేను ప్రేమిస్తున్నా, ఆమె నన్ను ప్రేమించడం లేదు. కాబట్టి కత్రి కైఫ్ నాకు వస్తే చాలా హ్యాపీగా ఫీలవుతాను. ఆమె నాకు దక్కక పోతే నాకు నచ్చదు. అలా అని కత్రినా కైఫ్ ను ఇన్సల్ట్ చేసినట్లా? అదే విధంగా నంది అవార్డులు.... నా అభిప్రాయం చెప్పాను, జ్యూరీ కమిటీని ఇన్ సల్ట్ చేసినట్లు ఎలా అవుతుంది? అని ఓ ప్రశ్నకు జేడీ సమాధానం చెప్పారు.

 నన్ను గుర్తించనపుడు నా ఉద్దేవ్యంలో అది రాంగ్

నన్ను గుర్తించనపుడు నా ఉద్దేవ్యంలో అది రాంగ్

‘గులాబీ' మూవీ సమయంలో నంది అవార్డు రానందుకు ఇప్పటికీ చాలా డిస్సప్పాయింట్ తో ఉన్నట్లున్నారు? ఆ ఫ్రస్టేషన్ ఇంకా కనిపిస్తోంది కదా? అని యాంకర్ ప్రశ్నించగా.... నేను గులాబి సినిమాను ఉద్దేశించి అనడం లేదు. గులాబీ కంటే ముందు మంచి సినిమాలు చేశాను. దాని తర్వాత కూడా మంచి సినిమాలు చేశాను. నన్ను గుర్తించనపుడు నా ఉద్దేవ్యంలో నాకు అది కరెక్టర్ కాదు.... అని జేడీ అన్నారు.

 చంద్రబాబు నాయుడి పాత్రలో

చంద్రబాబు నాయుడి పాత్రలో

వర్మ సినిమా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌'లో మీరు చంద్రబాబు నాయుడు పాత్ర చేస్తున్నారనే రూమర్స్ మీద జేడీ స్పందిస్తూ.... ఆ సినిమాలో నేను ఆ పాత్ర చేస్తున్నానా? లేదా? అనేది నాకు తెలియదు. ఎన్టీఆర్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్, గ్రేట్ యాక్టర్ అందుకే ఆయన మీద 4 బయోపిక్ లు తీస్తున్నారు అని తెలిపారు.

పవన్ సినిమాలకు ఓట్లు పడవు

పవన్ సినిమాలకు ఓట్లు పడవు

పవన్ సినిమాల వల్ల అభిమానులు ప్రభావితం అవుతారన్నది తప్పు. పవన్ చేసే సోషల్ యాక్టివిటీస్ వల్ల ప్రభావితం అవ్వాలి. సినిమాల వల్ల జనాలు వచ్చి ఓట్లే వేస్తారు అనుకుంటే అది జరుగదు. పవన్ కళ్యాణ్ సోషల్ యాక్టివిటీస్ చాలా చేస్తున్నారు కాబట్టే ఆయనకు అంత ఫాలోయింగ్ ఉంది అని జేడీ చక్రవర్తి అభిప్రాయ పడ్డారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X