వర్మతో ఉండి తప్పు చేసా: జెడి
తెలుగులో వరుసగా మంచి హిట్లిచ్చి బూమ్‌లో ఉండగా రాము రమ్మనగానే ఇక్కడన్నీ వదిలేసి బాంబే వెళ్లిపోయా. 'సత్య' సినిమా చేశా. ఆయన దగ్గరే ఉన్నా. ఇదంతా పరిణతి లేక, బాధ్యతారాహిత్యంతో చేసింది. నా కెరీర్‌ని ఎలా మలచుకోవాలన్నది నా చేతిలో పని. కానీ నేనప్పుడు అలా చెయ్యలేదు. అయితే జరిగినదానికి నేనేమీ బాధపడట్లేదు అంటున్నాడు జెడీ చక్రవర్తి. అతని తాజా చిత్రం మనీ మనీ మోర్ మనీ త్వరలో విడుదల అవుతోంది. ఈ చిత్రం ప్రమోషన్ సందర్బంగా కలిసిన మీడియాతో ముచ్చటిస్తూ ఇలా స్పందించారు.
అలాగే నాకు రామ్ గోపాల్ వర్మకు మధ్య విభేదాలు వచ్చాయని,టెర్మ్స్ సరిగ్గా లేవంటూ రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే అదంతా నిజం కాదు.దానికి కారణం నాకు తెలుసు. నేను రామ్ గోపాల్ వర్మ తో ప్రెస్ మీట్స్ లో కనపించటం లేదు.దాంతో జనం తమకు తోచిన విధంగా కథలు అల్లేసుకుని ప్రచారం చేస్తున్నారు అలాగే తాను రామ్ గోపాల్ వర్మ రోజూ మాట్లాడుకుంటామని అన్నారు. ఆయన నన్ను మొదట అప్పలరాజు చేయమని అన్నారు. అయితే నా ఆలోచనలతో నేను ఉండటంతో ఆ ఆలోచన విరమించుకున్నాను అన్నాడు.
అలాగే వర్మ ఈ చిత్రం గురించి తెలియగానే, తాను ఇదే ఐడియాతో ఉన్నానని చెప్పి,మొదట ఐడియా నాకు వచ్చినందుకు అభినందించారు. ఇక ఇప్పుడే ఈ చిత్రాన్ని ఆయనకు చూపెట్టడం ఇష్టం లేదని,హిట్ అయ్యిన తర్వాత ప్రత్యేకంగా చూపిస్తానని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











