వైఎస్ జగన్ మారాడు... విమానంలో జరిగిన ఘటన గుర్తు చేసుకున్న జేడీ!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైఎస్‌ జగన్ గురించి సినీ నటుడు జేడీ చక్రవర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదేళ్ల క్రితంతో పోలిస్తే ఇపుడు ఆయన చాలా మారిపోయాడని తెలిపారు. తన తాజా చిత్రం 'హిప్పీ' మూవీ ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జేడీకి ఏపీ కొత్త ముఖ్యమంత్రి గురించి ప్రశ్న ఎదురవ్వడంతో 2008లొ జరిగిన ఘటన గుర్తు చేసుకున్నారు.

2008లో ఒకసారి యాక్సిడెంట్ అయి నడవలేని స్థితిలో విమాన ప్రయాణం చేస్తుండగా జగన్ కూడా అదే విమానం ఎక్కి నా పక్కన కూర్చున్నారు. అపుడు నాకు సీటు సౌకర్యంగా లేదు, వీల్‌ఛైర్‌ కావాలని విమాన సిబ్బంది అడిగాను. జగన్ నన్ను చూసి కూడా పలకరించలేదు. 2018లో మళ్లీ ఎయిర్‌పోర్టులో జగన్ కలిసినపుడు ఎలా ఉన్నారని పలకరించారు. అప్పటికీ ఇప్పటికీ ఆయనలో చాలా మార్పు వచ్చిందని జేడీ తెలిపారు.

JD Chakravarthy about YS Jagan

అంతకు ముందు మరో ఇంటర్వ్యూలో జేడీ ఏపీ ఎన్నికలపై స్పందిస్తూ... పవన్ కళ్యాణ్ గెలిచి ఉంటే బావుండేది, ఆయన ముక్కుసూటి మనిషి. వైఎస్ జగన్మోమహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు. అలా అని చంద్రబాబు ఓడిపోవాలని కోరుకున్నట్లు కాదు. జగన్‌కు ఒక అవకాశం ఇచ్చి చూస్తే బావుంటుందని ప్రజలు అనుకున్నారని జెడీ అభిప్రాయపడ్డారు.

జేడీ నటించిన 'హిప్పీ' సినిమా విషయానికొస్తే... టిఎన్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీలో కార్తికేయ హీరోగా నటించాడు. ఇందులో జేడీ కీలకమైన పాత్ర పోషించారు. జూన్ 6న విడుదలైన ఈ మూవీ డీసెంట్ టాక్ సొంతం చేసుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X