అమ్మాయి గురించి చెప్పాలంటే.. మొత్తం చూడనక్కర్లేదు.. జేడీ చక్రవర్తి

జేడీ చక్రవర్తి.. ఈ పేరు వినగానే ఆయన అద్భుతమైన రూపం, ఎప్పుడూ గడ్డంతో కనిపించే ఆయన స్టైలే గుర్తుకు వస్తుంది. 1989లో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తీసిన శివ సినిమాలో నటించి మెప్పించాడు. ఆ సనిమా బ్లాక్ బస్టర్ హిట్టు కావండతో జేడీ చక్రవర్తికి ఆ తర్వాత కూడా అనేక సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. తెలుగుతో పాటు తమిళ్, హిందీలోనూ నటించి తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నాడు.

హీరోగానే కాకుండా విలన్ గా సహ నటుడిగా కూడా నటించి మెప్పించాడు ఈ సీనియర్ నటుడు. వన్ బై టు, మనీ మనీ, గులాబీ వంటి చిత్రాలతో కథానాయకుడిగా మంచి పేరునే తెచ్చుకున్నాడు. మృగం, దెయ్యం, బొంబాయి ప్రియుడు, ఎగిరే పావురమా చిత్రాలతో మరిన్ని విజయాలను అందుకున్నాడు. సత్య సినిమాతో విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్నాడు.

Jd chakravarthy bold comments on girls at antham kadidi arambam poster launch

రామ్ గోపాల్ వర్మతో ఎక్కువగా పని చేయడం వల్లేమో ఈయన.. ఆయన శిష్యుడిలానే మాట్లాడతారు. చాలా వరకు అమ్మాయిలు, అందం, మాకు ఇష్టం వచ్చినట్లు మేం బతుకుతాం అని చెబుతుంటారు. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నారు అనిపిస్తోందా.. ఆయన చేసిన కామెంట్ల వల్లండి. ఆయన తాజాగా అమ్మాయిలపై చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ గా మారాయి.

'అంతం కాదిది ఆరంభం' అని సినిమా పోస్టర్ ను విడుదల చేస్తూ... ఇంత మంచి టైటిల్ ఎవరూ ఇన్నాళ్లు ఎందుకు పెట్టుకోలేదని అన్నారు. అందుకే నిర్మాత సిరాజ్ ను టైటిల్ రిజిస్టర్ చేయించారా అని అడిగాను. ఒకవేళ చేయించకపోతే తాను కొట్టేసేవాడిన్నారు. కథలు కొట్టేయడం కామన్ అని, సరైన టైటిల్ దొరకడం లేదన్నారు. అన్నం ఉడికిందో లేదో చూసేందుకు ఓ మెతుకు చూస్తే చాలన్నట్లు.. సినిమా ఎలా ఉంటుందో టైటిల్ చూసి చెప్పేయొచ్చు అన్నారు.

Jd chakravarthy bold comments on girls at antham kadidi arambam poster launch

మా బాషలో చెప్పాలంటే అమ్మాయిని పూర్తి దగ్గరగా చూడాల్సిన అవసరం లేదు... దూరం నుంచి చూస్తే చాలు అమ్మాయి అందం తెలిసిపోతుందంటూ కామెంట్లు చేశారు. అంతం కాదిది ఆరంభం అనేది పాజిటివ్ సౌండ్ అద్భుతమైన టైటిల్ అని వివరించారు. ఈ సినిమా టీం అంతా కలిసి చేస్తున్న ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్టు కొట్టి.. అందరికీ మంచి పేరు తెచ్చి పెట్టాలని కోరుకుంటున్నట్లు వివరించారు. అందరికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X