జెడీ దర్శకత్వంలో ఈ సారి ఆ హీరో
గతంలో హోమం,సిద్దం,మనీ మనీ మనీ చిత్రాలు డైరక్ట్ చేసిన జెడీ చక్రవర్తి ఈ సారి మరో చిత్రానికి దర్శకత్వం చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సారి హీరోగా శ్రీకాంత్ ని ఎంచుకున్నారు. గతంలో శ్రీకాంత్,జెడీ చక్రవర్తి కలిసి నటులుగా వన్‌బైటూ,ఎగిరేపావురమా లాంటి హిట్ చిత్రాలలో నటించారు. ఇక ఈ కొత్త చిత్రాన్ని గతంలో 'దగ్గరగా దూరంగా' వంటి విభిన్న కథాచిత్రాన్ని నిర్మించిన సుధా సినిమా అధినేత జె.సాంబశివరావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ నెల 26న ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని నిర్మాత తెలిపారు. ఆద్యంతం వినోదభరితంగా, యాక్షన్ కూడా కలగలుపుకొని ఈ సినిమా సాగుతుందని ఆయన అన్నారు.
హైదరాబాద్ రాజమండ్రి,కాకినాడ,వైజాగ్, బ్యాంకాక్‌లలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది. ఇక ఈ చిత్రంలో జెడీ సైతం మరో హీరోగా కనిపించనున్నారు. చాలా గ్యాప్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం ఏ మేరుకు క్రేజ్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక ప్రస్తుతం శ్రీకాంత్ ..దేవరాయ చిత్రం చేస్తున్నారు. సోషియో ఫాంఠసీ చిత్రంగా రూపొందే ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. జేడీ సైతం మనీ మనీ మనీ ప్లాప్ కావటంతో ఈ చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నట్లు చెప్తున్నారు. అలాగే వరస ప్లాపుల్లో ఉన్న శ్రీకాంత్ కి సైతం ఇప్పుడు హిట్ రావాల్సిన అవసరం ఉంది.


Click it and Unblock the Notifications











