జెడి చక్రవర్తి దర్శకత్వంలో హీరో శివాజి
సిద్దం, హోమం చిత్రాలు డైరక్ట్ చేసిన జెడి చక్రవర్తి రీసెంట్ గా నితిన్ ఓ చిత్రం చేయటానికి కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ లోగా శివాజీతోనూ మరో వినోదాత్మక చిత్రం చేయటానికి రెడీ అవనున్నట్లు తెలుస్తోంది. కామిడీ ప్రధానంగా ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక జెడీ డైరక్ట్ చేసిన రెండు చిత్రాలు మంచి టేకింగ్ తో ఆకట్టుకోవటంతో శివాజి ఈ ప్రాజెక్టుని మరేమీ ఆలోచించకుండా ఒప్పుకున్నట్లు సమాచారం. ఇక శివాజీ...తాజ్ మహల్ ప్లాఫ్ తర్వాత నిరాశలో ఉన్నారు. అతని చేతిలో కేవలం భూలోకం టు యమలోకం వయా బ్రహ్మలోకం అనే చిత్రం మాత్రమే ఉంది. ఇక జెడీ..నితిన్ తో చేయబోయే చిత్రాన్ని బుర్రా ప్రశాంత్ నిర్మిస్తున్నారు. బుర్రా ప్రశాంత్ ఇంతకుముందు వర్మ కార్పోరేషన్ బ్యానర్ పై ఆవాహం (ఫూంక్ టు) చిత్రాన్ని నిర్మించారు.
More from Filmibeat
శివాజీ నితిన్ జెడీ చక్రవర్తి అడవి రెచ్చిపో ఇలియానా jd chakravarti siddam jagapathi babu nitin homam ram gopal varma


Click it and Unblock the Notifications











