జెడి చక్రవర్తి కొట్టినంత పని చేసేవారు
జెడి సార్‌కి ముక్కుమీదే ఉంటుంది కోపం. ఒక్కోసారి కొట్టినంత పని చేసేవారు. మళ్లీ వెంటనే మెత్తబడిపోయేవారు అంటోంది తాషా.జెడి చక్రవర్తి దర్శకత్వం వహించిన 'మనీ మనీ మోర్ మనీ"త్వరలో విడుదల అవుతోంది.ఈ చిత్రంలో తాషా హీరోయిన్ గా పరిచయం అవుతోంది.ఆమె ఈ జెడి చక్రవర్తి గురించి మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చింది.ఇక సినిమాలో తన పాత్ర గురించి చెపుతూ.. ఇందులో నా పేరు 'మ్యాగీ". పేరుకు తగ్గట్టుగా బబ్లీగా ఫన్నీగా, నాటీగా నా పాత్ర ఉంటుంది అంది.
నిర్మాత కె.సత్యనారాయణ మాట్లాడుతూ..మనిషిని నడిపించేది డబ్బే. దానికి దాసోహం అయితే మరేదీ కంటికి కనిపించదు... ఈ విషయాన్ని వినోదం జోడించి చెబుతున్నాం. మనీ, మనీ మనీ సినిమాల్లో ఎంత వినోదం ఉంటుందో అంతకు రెట్టింపు ఈ సినిమాలో ఉంది. బ్రహ్మానందం పాత్ర అందరినీ ఆకట్టుకొంటుందన్నారు.వచ్చే నెలలో సినిమాని విడుదల చేస్తారు. సంగీతం: చక్రి. సమర్పణ: రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్.


Click it and Unblock the Notifications











