జీవితంలో జూ ఎన్టీఆర్ కారు ఎక్కనని చెప్పా, పవన్ గెలిస్తే బావుండు: జేడీ
Recommended Video
ప్రముఖ నటుడు జెడీ చక్రవర్తి త్వరలో విడుదల కాబోతున్న 'హిప్పి' సినిమాలో కీలక పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా జేడీ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాంకర్ అతడి నుంచి ఆసక్తికర సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేసింది.
చిరంజీవిగారిని చూడగానే ఎనర్జీ గుర్తుకు వస్తుందని, బాలకృష్ణలో కాన్ఫిడెన్స్ బాగా నచ్చుతుందని, నాగార్జున చాలా స్వీట్ పర్సన్, వెంకటేష్ బ్రాడ్ షోల్డర్స్ అంటే చాలా ఇష్టమని జేడీ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఇటీవల ఏపీ ఎన్నికల ఫలితాలపై కూడా జెడీ రియాక్ట్ అయ్యారు.

పవన్ కళ్యాణ్ గెలిచి ఉంటే బావుండేది
ఇటీవల జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలిచి ఉంటే బావుండేది, ఆయన ముక్కుసూటి మనిషి. వైఎస్ జగన్మోమహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఆనందంగా ఉంది. అలా అని చంద్రబాబు ఓడిపోవాలని కోరుకున్నట్లు కాదు. జగన్‌కు ఒక అవకాశం ఇచ్చి చూస్తే బావుంటుందని ప్రజలు అనుకున్నారని జెడీ అభిప్రాయపడ్డారు.

మహేష్ బాబు చేసే ఆ సినిమాలకు కనెక్ట్ కావడం లేదు
మహేష్ బాబు ‘పోకిరి' లాంటి సినిమాలు చేస్తే బావుంటుంది. అందులో ఆయన చేసిన పాత్ర మహేష్ రియల్ లైఫ్ కు చాలా దగ్గరగా ఉంటుందని నా ఫీలింగ్. ఆయన మాట్లాడే పద్దతి, వ్యంగ్యం నాకు చాలా నచ్చుతుంది. ఇపుడు చేస్తున్న లార్జర్ దన్ లైఫ్ సినిమాలు చూసినపుడు నేను కనెక్ట్ కాలేకపోతున్నట్లు జెడీ తెలిపారు.

తారక్ చాలా భయపెట్టాడు, కారు ఎక్కనని చెప్పా
జూ ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే చాలా టాలెంట్ ఉన్న పర్సన్. తారక్ నిలువెల్లా టాలెంటుతో నింపబడిన మనిషి. నాకు చాలా క్లోజ్. అయితే అవతలి వారికి ఒక్కోసారి అతడు పెట్టే టెన్షన్ భయానకంగా ఉంటుంది. ఒకరోజు నన్ను కార్లో కూర్చోబెట్టుకుని మేఘాలలో తేలిపోతున్న సాంగ్ ఫుల్ సౌండ్ పెట్టి కళ్లు మూసుకుని 110 కిలోమీటర్ల స్పీడ్లో నడిపాడు. చాలా భయపడిపోయాను. మళ్లీ జీవితంలో నీ కారు ఎక్కను అన్నాను... ఇప్పటి వరకు ఎక్కలేదు. ఆ క్షణంలో ఆ పాట ఎందుకు చేశానా? అనే ఫీలింగ్ కలిగింది. అతడికి ఆ పాట కాకుండా ‘ఈ వేళలో' పాట నచ్చితే స్లోగా వెళ్లేవాడేమో అనిపించిందని... జెడీ చెప్పుకొచ్చారు.

చరణ్, ప్రభాస్, విజయ్ దేవరకొండ గురించి
రామ్ చరణ్ వెరీ వెల్ బిహేవ్డ్ పర్సన్. అందరితోనూ చాలా మర్యాదగా ఉంటారని జెడి చెప్పుకొచ్చారు. ప్రభాస్ గురించి పర్సనల్‌గా తెలియదు కానీ సినిమాలు బాగా నచ్చుతాయన్నారు. అల్లు అర్జున్ జెన్యూన్ వ్యక్తిత్వం ఉన్న మనిషి, విజయ్ దేవరకొండ చాలా ఓపెన్ మైండెడ్ అని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











