Dayaa Web Series Season 2: దయా వెబ్ సీరీస్ అనుమానాలు తీరిదే అప్పుడే... సీజన్ 2 వచ్చేది ఎప్పుడంటే?
థియేటర్లలో ఎన్ని సినిమాలు వచ్చినా... కరోనా తర్వాత చాలా మంది ఓటీటీ కంటెంట్ కు అలవాటు పడ్డారు. దానికి తగ్గట్లుగానే ప్రతి వారం ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్లు రిలీజ్ అవుతున్నాయి. సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అలా ఓటీటీ వేదికగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో దయా అనే వెబ్ సిరీస్ విడుదల అయిన సంగతి తెలిసిందే. ఇక ఇది సూపర్ రెస్పాన్స్ తో దూసుకువెళ్తోంది. అయితే ఇప్పుడు దయా వెబ్ సిరీస్ సీజన్ 2 గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే...
జేడీ చక్రవర్తి సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఈ మధ్యే ఓటీటీ కంటెంట్ లోకి అడుగు పెట్టారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ 'దయా'. బంగ్లాదేశ్ బెంగాలీ వెబ్ సిరీస్ తక్దీర్ కథ ఆధారంగా 'దయా' వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఇక ఇందులో జేడీ చక్రవర్తి ప్రధాన పాత్ర దయాగా నటించాడు. ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటం... ప్రమోషన్లను జోరుగా చేయడంతో ఈ సిరీస్ మంచి బజ్ తెచ్చుకుంది.

రాజేంద్ర ప్రసాద్ నటించిన సేనాపతి లాంటి క్రైమ్ థ్రిల్లర్ ను తెరకెక్కించిన పవన్ సాదినేని.. ఈ దయా వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించాడు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తెలుగుతో పాటు మరో ఆరు భాషల్లో దయా సీజన్-1 స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఆగస్టు 4వ తేదీ నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇక రిలీజ్ అయిన మొదటి రోజు మంచి రెస్పాన్స్ తో దూసుకువెళ్తోంది. ఇక ఈ సిరీస్ లో 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. దాదాపు 3 గంటలకు పైగా ఉన్న ఈ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ఈ దయా క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో ఈశా రెబ్బా, రమ్యా నంబీషన్, జోష్, రవి, విష్ణుప్రియ, పృథ్వీరాజ్, కమల్ కామరాజు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శ్రవణ్ భరద్వాజ్ ఈ సిరీస్ కు మ్యూజిక్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు. శ్రీకాంత్ మొహ్తా, మహేంద్ర సోనీ నిర్మాతలుగా వ్యవహారించారు. అయితే ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన దయా... కొన్ని అనుమానులను రెకిత్తించింది. ఇందులో కొన్నింటికి క్లారిటీ ఇవ్వలేదని కామెంట్స్ వచ్చాయి.

అయితే వీటన్నింటికీ సమాధానం చెప్పేందుకు... దయా వెబ్ సిరీస్ సీజన్ 2 రాబోతుంది. ఈ సీజన్ దర్శకుడు పవన్ సాదినేని మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. త్వరలో దయా వెబ్ సిరీస్ సీజన్ 2 రాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. అంతే కాదు.. కాస్త షూటింగ్ కూడా జరిగిందని తెలిపారు. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నెలలో దయా వెబ్ సిరీస్ సీజన్ 2 స్ట్రీమింగ్ కు తీసుకువస్తామని తెలిపారు.

దయా వెబ్ సిరీస్ సీజన్ 1లో కలిగిన అనుమానాలు... సీజన్ 2లో క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇక సీజన్ 2 లోకూడా జేడీ చక్రవర్తి హీరోగా ఉండనున్నారు. ఇప్పటికే ఆకట్టుకుంటున్న ఈ సీజన్ మరి సీజన్ 2 ఏ రేంజులో ఉండనుందో చూడాలి. ఇక పవన్ సాధినేని... త్వరలో గీతా ఆర్ట్స్ లో మరో సినిమా కూడా చేయనున్నట్లు చెప్పుకోచ్చారు. ఆ బ్యానర్ లో త్వరలో ఇంకో ప్రాజెక్టు చేస్తున్నట్లు వెల్లడించారు.


Click it and Unblock the Notifications











