Don't Miss!
- News ఏపీలో మోడీ ప్రచారం ఖరారు-4 బహిరంగ సభలకు ప్లాన్..!
- Sports PBKS vs MI: అందుకే రెండు మార్పులు చేశాం: సామ్ కరణ్
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఆ హీరోయిన్ కోసం గొడవ నిజమే, చేతకాని వాన్ని కాదు, ఇద్దరికీ దక్కలేదు: జేడీ
Recommended Video
'గులాబి' చిత్రంలో జేడీ చక్రవర్తి సరసన హీరోయిన్గా మహేశ్వరి నటించిన సంగతి తెలిసిందే. అప్పట్లో వీరి మధ్య లవ్ ఎఫైర్ ఉందనే వార్తలు హల్ చల్ చేశాయి. తాజాగా ఇదే అంశం ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావనకు రాగా... జేడీ చక్రవర్తి స్పందించారు.
మేము చాలా విషయాలపై మాట్లాడతాం. కానీ మీడియా వారు వారికి ఇష్టమైనవి, వైరల్ అయ్యే అంశాలు మాత్రమే పిక్ చేసుకుని వాటి గురించి ఎక్కువ ప్రచారం చేస్తారు. కాంట్రవర్సీలు క్రియేట్ చేసేది మా లాంటి సెలబ్రిటీలు కాదు, మీడియా వారే వాటిని సృష్టిస్తున్నారని జేడీ తెలిపారు. నా జీవితంలో చాలా జరిగాయి, కానీ ప్రతి సారి మహేశ్వరి ప్రస్తావన తెస్తూ నన్ను గిల్లుతూనే ఉన్నారని వ్యాఖ్యానించారు.
నా తల్లి గురించి పట్టించుకోరేం..
ఈ ప్రపంచంలో తల్లిని మించిన దైవం లేదని వెయ్యిసార్లు చెప్పాను. నా తల్లి ఇండియాలో అందరికంటే ఎక్కువ చదువుకుని మూడు ఎంఏలు, రెండు పీహెచ్డీ చేసి పెద్ద ప్రొఫెసర్ అయ్యారు....దాని గురించి ఎవరూ వేయరు. కానీ ఉందో లేదో తెలియని మహేశ్వరి ఎఫైర్ గురించి తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని... జేడీ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఎక్కడ గిల్లాలో అక్కడ గిల్లుతారు, తప్పు మీడియాది కాదు..
నేను మీడియాను తప్పుబట్టడం లేదు. జనాలకు ఏది బాగా ఎక్కుతుందో అదే అంశాన్ని బాగా హైలెట్ చేస్తారు. ఎవరిని ఎక్కడ గిల్లాలో మీకు బాగా తెలుసు. ఏ విషయం అయినా సెన్సేషన్ చేయడంలో మీరు సిద్ధహస్తులు. మాకు కావాల్సింది కూడా అదే అని జేడీ వ్యాఖ్యానించారు.
ఆమెతో ఎఫైర్ నిజం కాదు
మహేశ్వరితో ఎఫైర్ ఉందనే వార్తల్లో నిజం లేదని, ‘గులాబి' సినిమాలో మా కెమిస్ట్రీ అంత బాగా కుదిరింది. బయట జనాలు కూడా మా మధ్య ఏదో ఉంది అనుకునేంతగా అందరికీ కనెక్ట్ అయింది. అప్పట్లో అలాంటి వార్తలు రావడానికి కారణం కూడా అదే అయుండొచ్చని తెలిపారు.
వదిలేసేంత చేతకాని వాడిని కాదు
ఒక వేళ మా మధ్య అలాంటి రిలేషన్ ఏమైనా ఉంటే వదిలేసేంత చేతకాని వాడిని కాదు. మేము కేవలం స్నేహితులం మాత్రమే. చాలా సన్నిహితంగా ఉండేవారం. ఆమె నాతో పర్సనల్ విషయాలు కూడా పంచుకునేది. అంతకు మించి మా మధ్య ఏ రిలేషన్ లేదని జేడీ స్పష్టం చేశారు.
ఆమె కోసం ఇద్దరం గొడవపడ్డ మాట నిజమే
మహేశ్వరి కోసం నేను, దర్శకుడు కృష్ణ వంశీ గొడవపడ్డ మాట నిజమే. కానీ మా ఇద్దరిలో ఆమె ఎవరికీ దక్కలేదు. అంతే కానీ ఎపైర్లు పెట్టుకునే స్థాయిలో మా మధ్య రిలేషన్ లేదు. సినిమా సెలబ్రిటీలపై ఇలాంటి వార్తలు రావడం సర్వసాధారణమే అని తెలిపారు.