నేను, కృష్ణవంశీ ఒకే హీరోయిన్‌తో ప్రేమ.. అందుకే పెళ్లి చేసుకోలేదు: జేడీ చక్రవర్తీ షాకింగ్ కామెంట్స్
హీరో జేడీ చక్రవర్తి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అప్పట్లో గులాబీ, సత్య, బొంబాయి ప్రియుడు, మనీ మనీ, దెయ్యం వంటి సూపర్ హిట్ సినిమాలో ప్రేక్షకులను అలరించారు. అయితే ఈ హీరో పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాలను బయటపెట్టారు. తాను, డైరెక్టర్ కృష్ణ వంశీ ఒకే హీరోయిన్ ను ప్రేమించినట్లు వెల్లడించారు. ఓ ఇంటర్వ్వూలో పాల్గొన్నజేడీ.. తన ప్రేమ గురించి, పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే...
ఇంటర్వ్యూలో జేడీ షాకింగ్ కామెంట్స్...:ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జేడీ చక్రవర్తి.. తన ప్రేమ గురించి బయటపెట్టారు. ఎంతో ఆకర్షణ ఉంటే కానీ హీరోయిన్స్ అవ్వరు. అందం అనేది చూసే కళ్లలో ఉంటుంది. అలా ప్రతి హీరోయిన్ నచ్చేసింది. అయితే నచ్చడం వేరు ప్రేమించడం వేరు. శ్రీదేవి అంటే చాలా ఇష్టం. అయితే గులాబీ సినిమా సమయంలో నా హృదయంలో గంటలు మోగాయి. నేను, కృష్ణ వంశీ ఇద్దరం ఓకే హీరోయిన్ ను ప్రేమించాం. ఇప్పటికీ కొట్టుకుచస్తున్నాం. నాకు నచ్చే డైరెక్టర్లలో కృష్ణ వంశీ చాలా ఇష్టం. మేం మంచి ఫ్రెండ్స్.. అంటూ చెప్పుకువచ్చారు.

మేమిద్దరం కొట్టుకున్నాం... :మేమిద్దరం గులాబీ సినిమా చేస్తున్న సమయంలో పూజతో లవ్ లో పడ్డాం. పూజా అంటే.. ఎవరో కాదు.. మహేశ్వరి క్యారెక్టర్ పేరు. ఆ క్యారెక్టర్ తో లవ్ లో పడ్డాం. పూజా అని మొదలు పెట్టి.. మహేశ్వరి వరకు వెళ్లాం.. అక్కడి నుంచి మేం సీరియస్ గా తీసుకున్నాం. ఆమె గురించి ఇద్దరం కొట్టుకుసచ్చాం.. గులాబీ తర్వాత ఇప్పటి వరకు సినిమా తీయలేదు. ఇక కట్ చేస్తే ఆ అమ్మాయి ఎక్కడో పెళ్లి చేసుకుని సుఖంగా ఉంది.. మేం మాత్రం కొట్టుకుని సచ్చామంటూ బయటపెట్టారు జేడీ చక్రవర్తీ.
అప్పటంతా క్లోజ్ నెస్ లేదు...:ఆ అమ్మాయికి తెలుసు.. అయినా మా ఇద్దరినీ లైట్ తీసుకుంది. మేం ఇద్దరం తీవ్ర స్థాయిలో ప్రయత్నించాం. అరకు నుంచి వైజాగ్ వరకు బైక్ మీద వచ్చి చాక్లెట్స్ కొని ఇచ్చేవాడిని నేను ఇస్తే.. కృష్ణ వంశీ మాత్రం డబ్బా ఇచ్చేవాడు. అప్పట్లో మా మధ్య గొడవలు వచ్చాయి. ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం.. ఇప్పుడు కలిస్తే మాట్లాడుకుంటాం... మాట్లాడుకోవడానికి కలువం అంటూ వెల్లడించారు జేడీ.

అందుకే ఒంటరిగా ఉండిపోయా..:ఇక తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. ఐ లవ్ ఎవ్రీబడి.. నాకు వర్కౌట్ కాలేదు.. అంతే. నా కోసం మా మదర్ ఓ అమ్మాయిని తీసుకువచ్చింది. అప్పుడు ఒక ఫ్లాట్ కన్ స్ట్రక్షన్ అవుతుంది. అక్కడ ఆ అమ్మాయి వచ్చి.. నాతో మాట్లాడుతుంది. పెళ్లాయ్యక మీ మదర్ ఎక్కడు ఉంటుందని అడిగింది. నేను షాకయ్యాను. అదేంటి నేను ఒక్కడినే కొడుకుని.. మళ్లీ ఇలా అడుగుతుందని షాకయ్యాను.. అలా అందరూ ఉంటారని కాదు.. నాకు జరిగింది చెప్తున్నా అంటూ వెల్లడించారు. ఇక అలా ఒంటరిగా ఉండిపోవాల్సి వచ్చిందని తెలిపారు.


Click it and Unblock the Notifications











